Homeఆంధ్రప్రదేశ్‌MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్య వీడియో.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ.. మహిళతో...

MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్య వీడియో.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ.. మహిళతో అనుచిత ప్రవర్తన

వైసీపీ నేతల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా లైంగిక పరమైన ఆరోపణలు వస్తున్నాయి. మొన్న విజయసాయిరెడ్డి, నిన్న దువ్వాడ శ్రీనివాస్, నేడు తాజాగా ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది.

MLC Ananthababu: ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో బయటపడింది. ఓ మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు. దీనికి సంబంధించిన వీడియో మీడియాకు అందించింది సదరు మహిళ. ఇక ఆ వీడియో కాల్ లో మహిళకు ముద్దులు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు తన ప్యాంటు విప్పి మరి రచ్చ చేశాడు అనంతబాబు. ఇదంతా వీడియో కాల్ లో రికార్డ్ అయింది.దీంతో మరోసారి మీడియాలో ఇదే ప్రధాన అంశంగా మారిపోయింది. గత రెండు వారాలుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన భర్త వేరే మహిళతో ఉంటున్నారని ఆరోపిస్తూ దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలు శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ ఘటనపై వైసీపీ ఆలస్యంగా స్పందించింది. దువ్వాడ శ్రీనివాసును టెక్కలి ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అయితే అది జరిగి ఒక్కరోజు కాకమునుపే మరో ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో కాల్ లో అనుచితంగా మాట్లాడడమే కాకుండా.. అసభ్యంగా కనిపిస్తూ దొరికిపోయారు. ఇప్పుడు ఆయనపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

* హత్య కేసులో నిందితుడు
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక హత్య కేసులో బెయిల్ పై ఉన్నారు. తన డ్రైవర్ ను హత్య చేసి ఇంటికే పార్సిల్ చేయించారు. సాధారణ మరణం గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పట్లో దీనిపై విమర్శలు చెలరేగాయి. జైలులోనున్న అనంతబాబును తప్పించేందుకు వైసిపి కీలక నేతలు ప్రయత్నించారు. అప్పట్లో బెయిల్ లభించిన అనంత బాబుకు వైసీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. ఈ ఎన్నికల్లో అనంత బాబు వైసీపీ తరఫున గట్టిగానే పోరాటం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు.

* మీడియాను ఆశ్రయించిన బాధిత మహిళ
ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. అనుచితంగా ప్రవర్తించారు. ఆమెకు ముద్దులు పెడుతూనే.. తన ఫాంటు జిప్ ను విప్పి చూపించారు. అది స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయింది. అయితే ఆ వీడియోను సదరు బాధిత మహిళ మీడియాకు అందించినట్లు తెలుస్తోంది. మరోసారి అనంత బాబు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆయన పై హత్య కేసు నమోదు అయ్యింది. అయితే అప్పట్లో వైసీపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వైసిపి తీరుపై విమర్శలు వచ్చాయి.

* మహిళా కమిషన్ కు ఫిర్యాదు
దీనిపై టిడిపి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతోంది. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. వరుసగా పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు, వెలుగు చూస్తున్న ఘటనలతో వైసిపి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం విజయసాయి రెడ్డి పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. అటు తరువాత దువ్వాడ ఫ్యామిలీ రాద్ధాంతం ప్రారంభమైంది. అది ఒక వైపు జరుగుతుండగానే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో బయటకు వచ్చింది. మరి వైసీపీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper