Y Chromosomes: పురుషుల్లోని శుక్రకణాలు తల్లి కడుపులో పెరిగే బిడ్డకు సంబంధించి లింగాన్ని నిర్ధారిస్తాయి. ఇందుకు గానూ శుక్రకణాలోని వై – క్రోమోజోమ్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి వై క్రోమోజోమ్స్ లోని జన్యువుల సంఖ్య దారుణంగా తగ్గుతోంది. వచ్చే రోజుల్లో వీటి సంఖ్య అంతర్దానమవుతుందని పరిశోధనలో తేలింది. జపాన్ దేశానికి చెందిన హొక్కయిడో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెళ్లడైంది.. ఇది ఇలాగనే కొనసాగితే భవిష్యత్తు కాలంలో పురుష జననాలు ఏమాత్రం ఉండవట. అయితే వినూత్న పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణ ద్వారా కొత్త జన్యువులను సృష్టించేందుకు అవకాశం ఉంటుందట.. ఈ వివరాలను జపాన్ శాస్త్రవేత్తలు “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్” అనే జర్నల్ లో ప్రచురించారు.
ఈ భూమ్మీద క్షీరదాల (మనిషి కూడా) జాతికి చెందిన జంతువుల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మగ జంతువుల్లో ఎక్స్ తోపాటు వై – క్రోమ్ జోమ్ లు కూడా ఉంటాయి. పురుషుల్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ లో 900 వరకు రకరకాల జన్యువులు ఉంటాయి. వై – క్రోమోజోమ్ లో మాత్రం 900 వరకు ఉండాల్సిన జన్యువులు 55 వరకు పడిపోయాయి. గత 166 మిలియన్ సంవత్సరాల నుంచి జన్యువుల క్షీణత క్రమేపీ పడిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 110 లక్షల సంవత్సరాల లో వై – క్రోమో జోమ్ లో మిగిలిన ఆ కాస్త 55 జన్యువులు (ఎస్ ఆర్ వై జన్యువులు) పూర్తిగా కనిపించకపోవచ్చని.. ఇలాంటి పరిణామం కనుక చోటు చేసుకుంటే పుట్టే శిశువులు మొత్తం ఆడ శిశువులు గానే జన్మించేందుకు అవకాశం .
ఆ క్రోమోజోమ్ అందుకే కీలకం
ఒక స్త్రీ గర్భం దాల్చిన 12 వారాల తర్వాత.. పెరిగే పిండంలో పురుష లక్షణాలు (వృషణాలు ఏర్పడేందుకు కారణమయ్యే దశ) ఏర్పడేందుకు వై – క్రోమో జోమ్ కారణమవుతుంది.. గర్భంలో ఉండే పిండం లో వృషణాలు, పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ను వై – క్రోమోజోమ్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా శిశువు మగ బిడ్డగా రూపాంతరం చెందుతాడు. అందుకే వై క్రోమో జోమ్ ను లింగ నిర్ధారణను ప్రేరేపించే జన్యువుగా పిలుస్తారు. జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలో తూర్పు ఐరోపాలో కనిపించే ఒక రకమైన ఎలుక జాతికి చెందిన మగ ఎలుకలు, జపాన్ దేశంలో కనిపించే మగ స్పైన్ ఎలుకల్లో వై – క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయాయని తేలింది.. అయితే వై క్రోమోజోమ్ లోని జన్యుల లక్షణాలు కలిగిన మరికొన్ని కొత్త జన్యువులు ఆయా జాతులకు చెందిన మగ జీవుల్లో కొత్తగా పుట్టుకు రావడం శాస్త్రవేత్తల్లో సరికొత్త ఆలోచనలకు బీజం ఏర్పడుతోంది. అయితే మనుషుల్లోనూ ఇలానే జరిగేందుకు ఆస్కారం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: It has been shown that the y chromosome has completely disappeared in male spiny mice found in japan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com