Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Internal Issues: వీక్ కంటెంట్.. జగన్ ఫైర్.. కనిపించకుండా పోయిన పెద్దాయన

YSR Congress Internal Issues: వీక్ కంటెంట్.. జగన్ ఫైర్.. కనిపించకుండా పోయిన పెద్దాయన

YSR Congress Internal Issues: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్ పక్కన కనిపించే ఈ సలహాదారుడు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే ప్రధానంగా మీడియాలో పనిచేసే అనుభవం ఉన్నందున సజ్జలు ఇచ్చిన స్క్రిప్టును చూడకుండానే చదివేస్తుంటారు జగన్. ఈ క్రమంలోనే ఇటీవల మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అదే స్టీల్ […]

YSR Congress Internal Issues: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్ పక్కన కనిపించే ఈ సలహాదారుడు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే ప్రధానంగా మీడియాలో పనిచేసే అనుభవం ఉన్నందున సజ్జలు ఇచ్చిన స్క్రిప్టును చూడకుండానే చదివేస్తుంటారు జగన్. ఈ క్రమంలోనే ఇటీవల మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అదే స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడిన వీడియోలను బయటకు తీసి సోషల్ మీడియాలో విడిచిపెట్టింది. అది మొదలు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సెగలు పుట్టినట్లు అర్థమవుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించకుండా మానేశారు అప్పటినుంచి.

* స్టీల్ ప్లాంట్ విషయంలో..
ఇటీవల అనకాపల్లి జిల్లాలో మిట్టల్ కంపెనీ( Mittal company) స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇది. ఎలాగూ దీని తర్వాత జగన్ స్పందిస్తారు కాబట్టి.. ఆయన స్పందనను అందరూ ఊహించారు. అసలు మిట్టల్ కంపెనీ తెచ్చింది తానని.. అందుకోసం భూసేకరణ రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పారు జగన్. వెంటనే టిడిపి స్పందించింది. లోకేష్ మాట్లాడాడు.. ఆదిత్య మిట్టల్ కంపెనీ వచ్చేసిందట అని జగన్ ఎగతాళిగా మాట్లాడారు ఆ వీడియోలు. అంతటితో ఆగకుండా ఆ కంపెనీ ఒడిస్సా ఎప్పుడో వెళ్లిపోయిందని.. అటువంటి కంపెనీ ఏపీకి వచ్చిందంటే నమ్మాలా అంటూ బదులిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒడిస్సా వెళ్లిపోయిందని చెప్పింది జగనే.. లోకేష్ తేలేకపోయారని చెప్పింది జగనే.. ఇప్పుడు వచ్చిన కంపెనీ తన వల్లే వచ్చిందని చెబుతున్నారు జగనే.. అంతిమంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఏకిపారేశారు నెటిజన్లు. అయితే వీక్ కంటెంట్ ఇస్తావా? కనీసం చెప్పాలి కదా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పై జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

* రాజధాని విషయంలో అలా..
మొన్న ఆ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) నేతృత్వంలో అమరావతిలో ఒక అనుకూల జర్నలిస్టుతో కాంక్లేవ్ నిర్వహించారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల అంశానికి యూటర్న్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోసారి గెలిస్తే అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు ప్రారంభిస్తారని కూడా బదులిచ్చారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంతో వైసిపికి డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కొత్తగా అమరావతి అంటే కచ్చితంగా ఆ ప్రభావం పార్టీపై ఉంటుంది. కనీసం తనతో సంప్రదించకుండా అలా మాట్లాడడాన్ని తప్పుపట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే గత కొంతకాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కార్యాలయంలో కనిపించడం మానేశారు. విజయసాయి రెడ్డి విషయంలో కూడా అలానే నడిచింది. ప్రాథమికంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గించే క్రమంలో ఆయనను దూరం పెట్టారు జగన్. ఇప్పుడు సేమ్ సీన్ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జరుగుతోందన్న టాక్ ఉంది. చూడాలి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper