Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: 11:11:11:11.. జగన్ ను దసరా పూట ఇంతలా ర్యాగింగ్ చేయాలా విజయసాయి రెడ్డి...

Vijayasai Reddy: 11:11:11:11.. జగన్ ను దసరా పూట ఇంతలా ర్యాగింగ్ చేయాలా విజయసాయి రెడ్డి సార్?

Vijayasai Reddy: ఇది మామూలు ర్యాగింగ్ కాదు. ఒక రేంజ్ లో విమర్శించారు. అలాగని పేరు పెట్టలేదు. ఒక రేంజ్ లో ఆరోపణలు చేశారు. నేరుగా పేరు ప్రస్తావించలేదు. జస్ట్ తనకు అలవాటయిన స్థాయిలో.. త్రివిక్రమ్ మాటలాగా.. జంధ్యాల పంచ్ లాగా.. సూటిగా.. సుత్తి లేకుండా.. బాణాల లాంటి మాటలతో విమర్శించారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ స్థాయిలో జగన్ ను ఎవరూ విమర్శించలేదు. సూటిగా తగిలేలాగా ఎత్తి పొడవలేదు. ఏపీ రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని రాజ్యసభ […]

Vijayasai Reddy: ఇది మామూలు ర్యాగింగ్ కాదు. ఒక రేంజ్ లో విమర్శించారు. అలాగని పేరు పెట్టలేదు. ఒక రేంజ్ లో ఆరోపణలు చేశారు. నేరుగా పేరు ప్రస్తావించలేదు. జస్ట్ తనకు అలవాటయిన స్థాయిలో.. త్రివిక్రమ్ మాటలాగా.. జంధ్యాల పంచ్ లాగా.. సూటిగా.. సుత్తి లేకుండా.. బాణాల లాంటి మాటలతో విమర్శించారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ స్థాయిలో జగన్ ను ఎవరూ విమర్శించలేదు. సూటిగా తగిలేలాగా ఎత్తి పొడవలేదు.

ఏపీ రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు.. వైసిపి మాజీ నాయకులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు తన కొత్త పార్టీ ప్రకటన తేదీని.. ముహూర్తాన్ని కూడా వెల్లడించారు. అన్ని 11 లు వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి విజయదశమినాడే పార్టీని ప్రకటిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ పేరును దసరా రోజు కాకుండా.. వచ్చేనెల 11వ తారీఖు , 11 గంటల 11 నిమిషాలకు బెజవాడలోని ఏ కన్వెన్షన్ లో తన నూతన పార్టీ పేరును.. ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

2024 లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఏపీలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పడిపోయింది. ఇక అప్పటినుంచి 11 అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. విపక్ష హోదా కూడా వైసిపికి లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ 11 సంఖ్య వైసిపి నాయకులకు.. జగన్ కు పీడకల మాదిరిగా మారిపోయింది. అసలే 11 సంఖ్యను టిడిపి.. జనసేన నాయకులు పదేపదే గుర్తు చేస్తున్న నేపథ్యంలో.. అది వైసిపి నాయకులకు రాచ పుండు లాగా మారిపోయింది.. దానిమీద కారంచల్లే విధంగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు.. మొత్తంగా తన పార్టీ ప్రకటనను 11 కు అవినాభావ సంబంధం ఉండేలాగా విజయ సాయి రెడ్డి స్కెచ్ వేశారు. విజయసాయి రెడ్డి గతంలో జగన్ కు ఆర్థిక.. రాజకీయ సలహాదారుగా పనిచేశారు. ఒక రకంగా లెక్కల మాస్టర్ గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు అదే లెక్కలతో జగన్ ను గట్టిగా దెబ్బ కొడుతున్నారు.

తేదీలు.. గంటలతోనే విజయసాయిరెడ్డి ఆగిపోవడం లేదు. జగన్ పరిపాలనను.. వైసిపి మూలాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. జన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా.. హత్య రాజకీయాల నుంచి విముక్తి కల్పించే విధంగా.. కుటుంబ పార్టీల దోపిడీకి ముగింపు పలికే విధంగా తన పార్టీ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, బానిసల మాదిరిగా మార్చుకున్నారని.. జేజేలు కొట్టే యంత్రాలుగా రూపొందించుకున్నారని.. ఇవన్నీ కూడా రావణాసురుడి అవ లక్షణాలని.. మొత్తంగా పది పాయింట్లు తో జగన్ రాజకీయ తీరును విజయసాయిరెడ్డి సర్ఫ్ ఎక్సెల్ తో ఉతికినట్టు ఉతికేశారు. పార్టీ ప్రారంభం కాకముందే విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో ఉంటే.. పార్టీని ప్రారంభించిన తర్వాత ఎలా ఉంటారో.. వైసీపీని ఎలా ఆడుకుంటారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper