Homeఆంధ్రప్రదేశ్‌Undavalli Arun Kumar: జగన్ కు కష్టం వస్తే.. అర క్షణం కూడా ఆగని ఉండవెల్లి

Undavalli Arun Kumar: జగన్ కు కష్టం వస్తే.. అర క్షణం కూడా ఆగని ఉండవెల్లి

Undavalli Arun Kumar: వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతో అభిమానం. ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి రాజమండ్రి ఎంపీ టికెట్ రెండుసార్లు ఇచ్చారు. పార్లమెంట్లో అడుగు పెట్టేలా చేశారు. తన ఈ పరపతికి, గౌరవానికి రాజశేఖర్ రెడ్డి కారణం అని ఉండవల్లి అరుణ్ కుమార్ తరచూ చెబుతుంటారు. అందుకే ఇప్పుడు ఆ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి పై చూపిస్తున్నట్టు ఉన్నారు ఉండవెల్లి. జగన్ అడగకపోయినా, వైసీపీకి అవసరం లేకపోయినా వారి రాజకీయ శ్రేయస్సుకోసం ఎప్పుడూ ఏదో ఒక సలహాతోనో.. సూచనతోనూ మీడియా ముందుకు వస్తుంటారు. తన గళాన్ని వినిపిస్తుంటారు. అవసరం లేకపోయినా సలహాలు ఇస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోయినా ఉండవెల్లి మాత్రం పట్టించుకోకుండా ఉండలేరు. తాజాగా కూడా మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చి వెళ్లిపోయారు.

* ఆ అంశాలపై స్పందించకుండా..
ప్రస్తుతం జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన ట్రెండింగ్ లో ఉంది. దీంతో వైసిపి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందోనని మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. అమరావతికి చట్టబద్ధత లభించిన అంశంపై స్పందించలేదు. ఎందుకు కృషి చేసిన చంద్రబాబు ప్రస్తావన లేదు. జగన్ మావిగన్ ప్రతిపాదన గురించి కూడా ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే ఏం చేయాలో చెబుతూ.. పరోక్షంగా జగన్ శ్రేయస్సు కోసం.. వైసిపి మేలు కోసం తన వంతు సలహాలతో వైయస్సార్ అభిమానిని అనిపించుకున్నారు.

* కూటమిలో చీలిక తేవాలని
టిడిపి, జనసేన, బిజెపి రాజకీయ బంధం ఇలానే కూటమి ద్వారా ముందుకు వెళ్తే మాత్రం జగన్ 2.0 కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయని తేల్చి చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli Arun Kumar) . కేవలం కూటమిలో చీలిక వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా మరో ఛాన్స్ ఉండదని కుండబద్దలు కొట్టారు. అంటే ఆ కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డిని సలహా ఇస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూటమి ఉండాలని కోరుకుంటున్నారు బలంగా. భారతీయ జనతా పార్టీ సైతం కూటమికి బాగానే సహకారం అందిస్తోంది. పరిస్థితి చూస్తుంటే కూటమి తిరుగులేని శక్తిగా మారుతోంది. అందుకే ఏదో ఒక రాజకీయం చేసి ఆ కూటమిని విడగొట్టాలని ఉండవెల్లి సలహా ఇస్తున్నట్టు ఉంది.

* అంబటి అరెస్టును తప్పు పట్టిన వైనం
జగన్ రాజకీయ శ్రేయస్సు కోసం ఆరాటపడే తత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ ది. కానీ తాను అటువంటి వాడిని కాదని చెబుతున్నారు. తనకు రాజకీయాలు అంటే అసహ్యం కలిగిందని చెప్పుకొస్తున్నారు. కానీ రాజకీయ సలహాలు ఇస్తున్నారు. కనీసం ఉండవల్లి లాంటి నేతను రాజకీయ సలహాదారుడిగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ప్రయోజనం. కానీ జగన్ దగ్గర చేర్చుకోవడం లేదు. మొన్న ముఖ్యమంత్రిని తిట్టి అరెస్టయ్యారు అంబటి రాంబాబు. ఆయనను జైలు కెళ్ళి పరామర్శించారు ఉండవల్లి. అంబటి అరెస్టు వైసిపికి రాజకీయ లబ్ధి చేకూరుస్తుందని ఆవేశంగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమిని చీల్చు.. లేకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. కానీ అటువంటి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు జగన్. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏమీ లేదు కూడా. కేవలం ఉండవల్లి వృధా ప్రయాస తప్ప..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper