spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TTD 2026 Budget Decisions: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు

TTD 2026 Budget Decisions: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు

TTD 2026 Budget Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ శనివారం వివరాలను వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు & కీలక నిర్ణయాలు

శ్రీవారి ముడుపు పత్రం: నగదు, నాణేల ఇబ్బందులు లేకుండా, యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులు చేసి ‘ముడుపు పత్రాలు’ పొంది, వాటిని హుండీలో వేసే కొత్త విధానానికి ఆమోదం.

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

అన్నప్రసాద భవనం: రిలయన్స్ సంస్థ విరాళంతో తిరుమలలో అత్యాధునిక వంటశాల, మరో అన్న ప్రసాద భవనం నిర్మాణం.

కమాండ్ కంట్రోల్ సెంటర్: దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, వసతి గృహాల భద్రతను పర్యవేక్షించడానికి తిరుపతిలో రూ. 10.75 కోట్లతో ప్రత్యేక కేంద్రం.

భద్రత: అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ. 8 కోట్లతో ఆధునిక స్కానర్లు, 700కు పైగా భద్రతా సిబ్బంది నియామకం.

విద్యా వ్యవస్థ: టీటీడీ విద్యాసంస్థల ఆధునీకరణకు రూ. 118.89 కోట్ల కేటాయింపు.

వకుళామాత ఆలయం: అక్షరాభ్యాసం కోసం ‘గోవింద అక్షరమాల’ కార్యక్రమం.

ప్రత్యేక ఆకర్షణలు..
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఈసారి ఉచితంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అలాగే, ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper