spot_img
HomeతెలంగాణTelangana Electricity Demand February 2026: ఫిబ్రవరిలోనే ఏంటీ ఉపద్రవం..

Telangana Electricity Demand February 2026: ఫిబ్రవరిలోనే ఏంటీ ఉపద్రవం..

Telangana Electricity Demand February 2026: మార్చి నెల ఇంకా మొదలుకాకముందే ఎండలు ఉద్ధృతం అవుతున్నాయి. భానుడి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ ప్రభావం తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) పరిధిలో స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు

శనివారం ఒక్కరోజే 6,057 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదవడం విశేషం. ఫిబ్రవరి నెలలోనే ఇంత అధిక వినియోగం నమోదవడం ఇదే తొలిసారి అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 మెగావాట్ల రికార్డును ఈసారి ఫిబ్రవరిలోనే అధిగమించడం గమనార్హమని పేర్కొన్నారు.

వేసవి తీవ్రత పెరిగే ముందు నుంచే విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి సంస్థ చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 35 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 366 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చినట్లు వెల్లడించారు. అదనంగా 7,600 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి, ఓవర్‌లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్లను విభజించినట్లు చెప్పారు.

ఇక 1,200 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ లైన్లు నిర్మించడం, తక్కువ వోల్టేజ్ సమస్యను తగ్గించేందుకు 392 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు.

వేసవిలో మరింత పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎండీ స్పష్టం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper