spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Vs YSRCP: టిడిపిని చూసి వైసిపి నేర్చుకోవాల్సిందేనా..

TDP Vs YSRCP: టిడిపిని చూసి వైసిపి నేర్చుకోవాల్సిందేనా..

TDP Vs YSRCP: రాజకీయాలు చేయడం అనేది ప్రతి పార్టీకి ముఖ్యం. సిద్ధాంతాలు వేరు కానీ అన్ని పార్టీల సారం ఒక్కటే. ప్రజా సంక్షేమమే ప్రతి పార్టీ లక్ష్యం. కానీ వెళ్లే దారులే వేరు. అయితే అధికారపక్షంలో ఉంటే దానిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు వడ్డాలి. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రయత్నం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అతివిశ్వాసం ప్రదర్శించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే భ్రమల్లో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి చిన్న అంశం పై కూడా పోరాటం చేసింది. ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చాక కూడా ప్రజలు దూరం కాకుండా సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూస్తూ ముందుకు సాగుతోంది.

* ప్రతిపక్ష ఉనికి చాటుకోలేక..
ప్రతిపక్షం ఎలా ఉండాలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదు. 2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. కానీ అప్పట్లో ఆ పార్టీది ఫ్రెష్ లుక్. ఏం చెప్పినా ప్రజలు నమ్మేవారు. ఆపై రాజకీయ వ్యూహాలు కూడా పనిచేసేవి. ఇప్పుడు మాత్రం అలా కుదరదు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీగా వైసిపి వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే కొత్తగా ఆలోచించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. ఆ పార్టీ పడిపోయిన ప్రతిసారి పైకి లేచింది. అయితే ఆ లేచిన తీరు వెనుక చాలా శ్రమ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది కనిపించడం లేదు.

* పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి..
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా రాలేదు. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అటు తరువాత వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఎక్కడ కృంగిపోలేదు పార్టీ అధినేత చంద్రబాబు. ఓడిపోయిన కొద్ది రోజులకే చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. నిండు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తున్న లెక్క చేయలేదు. ఎక్కడెక్కడో ఉన్న టిడిపి శ్రేణులను బయటకు తెచ్చి పోరాట బాట పట్టారు.

* వైసీపీ శ్రేణులు యాక్టివ్ అయినా..
2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ ఘోర ఓటమి నుంచి తేరుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ శ్రేణులు యాక్టివ్ గా ముందుకు వస్తున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు మాత్రం ముందుకు రాని పరిస్థితి. అప్పట్లో టిడిపిలో అది రివర్స్. ఎక్కడెక్కడో మూలన దాగివున్న టిడిపి శ్రేణులను పోరాట బాట పట్టించారు చంద్రబాబు. ఇప్పుడు పోరాడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి కానీ.. నడిపించే నేతలు లేకుండా పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్షం ఎలా ఉండాలో.. ప్రతిపక్షం ఎలాంటి పోరాటాలు చేయాలో.. టిడిపిని గమనిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టాలెక్కినట్టే…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper