Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: వైసీపీ నుంచి చేరికలకు స్టాప్.. చంద్రబాబు వ్యూహమా?

CM Chandrababu: వైసీపీ నుంచి చేరికలకు స్టాప్.. చంద్రబాబు వ్యూహమా?

వాస్తవానికి వైసీపీపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అటువంటివారు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కొద్దికాలం వేచి ఉండి తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు వైసీపీ సీనియర్లంతా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి అయితే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

CM Chandrababu: వైసీపీ నుంచి చేరికలు ఆగాయా? లేకుంటే చంద్రబాబు ఆపారా? ఈ విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. దీంతో ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇలా పార్టీని వీడుతున్న వారు కొద్దిమంది మాత్రమే టిడిపిలో చేరారు. మిగతావారు పొలిటికల్ జంక్షన్ లోనే ఉన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో తాజా మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా పదవికి రాజీనామా చేశారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా గుడ్ బై చెప్పారు. అయితే ఇందులో ఒకరిద్దరు మాత్రమే టిడిపిలో చేరారు. మరో ఇద్దరు ముగ్గురు జనసేనలో చేరారు. అయితే వారిని వ్యూహాత్మకంగానే ఏ పార్టీలో చేర్చలేదని తెలుస్తోంది. కానీ వారిని వైసీపీ నుంచి దూరం చేయడంలో మాత్రం ఏదో వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వంపై వైసిపి దాడి చేసినప్పుడు, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని ప్రయత్నించినప్పుడు.. చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.

* చాలామంది నేతల్లో అసంతృప్తి
వాస్తవానికి వైసీపీపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అటువంటివారు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కొద్దికాలం వేచి ఉండి తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు వైసీపీ సీనియర్లంతా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి అయితే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. క్యాడర్ను సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన సైతం పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఒక్కరే కాదు చాలామంది నేతల తీరు అలానే ఉంది. పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుంటామన్న ఆలోచనతో ఉన్నారు. మరికొందరైతే కాంగ్రెస్ పార్టీ బలపడితే ఆ పార్టీలో చేరేందుకు ఆలోచన చేస్తున్నారు.

* కోఆర్డినేటర్ల ఎంపికలో దక్కని చోటు
వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ల ఎంపిక ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోంది. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ వారిని రీజినల్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేయలేదు. తన సామాజిక వర్గానికి చెందిన ఏకంగా ఐదుగురిని ఆ పదవులు ఇచ్చారు జగన్. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా సీనియర్ నేత అయిన బొత్సను ప్రయోగించారు. అయితే ఇతర సామాజిక వర్గ నేతలను జగన్ నమ్మడం లేదని వైసీపీలో ప్రచారం సాగుతోంది. అయితే మున్ముందు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వైసిపి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కొద్దిగా కాలం సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ తీరు ఇలానే కొనసాగితే మాత్రం.. ఎక్కువమంది కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే చేరికల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే వైసీపీ సేఫ్ జోన్ లో ఉందని.. లేకుంటే ఆ పార్టీ ఖాళీ అయిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper