Secunderabad: విశ్వనగరం హైదరాబాద్ అల్లర్లకు అడ్డాగా మారుతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అది చివరకు చేతల వరకూ వచ్చింది. దీంతో హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రభుత్వం చూస్తోందని విపక్షాలు ఆరోపించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా గెలిపించనందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న తరుణంలోనే ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ఇద్దరు వ్యక్తులు ధ్వసం చేశారు. దీంతో రాజకీయ గొడవలు ఇప్పుడు మతాలవైపు మళ్లాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచా‍్చక రాష్ట్రంలో మత ఘర్షణలు మొదలయా‍్యయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో గొడవ కాస్త సద్దు మణిగినట్లు కనిపించింది. కానీ, విగ్రహ ధ్వంసానికి నిరసనగా హిందు సంఘాలు శనివారం నిరసనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ర్యాలీలు చేపట్టారు.
ర్యాలీలో ఘర్షణ..
వీహెచ్‌సీ, హిందూ సంఘాల కార్యకర్తల ర్యాలలో ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. ర్యాలీలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది క్రమంగా తీవ్రం కావడంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు పోలీసులపైకి కుర్చీలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు విసిరారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరసనకారులను చెదరగొట్టారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దృశ్యాలు న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి.
ఇంటర్నెట్ బంద్..
లాఠీచార్జి వీడియోలు వైరల్‌అవుతుండడంతో మత ఘర‍్షణలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు సికింద్రాబాద్ పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా బలగాలను పోలీసులు మోహరించారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Secunderabad vhp and bajrang dal staged a bandh over the destruction of mutyalamma temple idols and the police lathi charged them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com