YCP leader facing criticism: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో.. అందరికీ సుపరిచితులు అయ్యారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆయన అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ మంత్రులకు మించి పాపులారిటీ సాధించారు. ఇలాంటి ఎమ్మెల్యే తమకు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడేవారు. అయితే ఆయన సైతం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన సత్య కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇంతటి పాపులారిటీ సాధించిన తనకు.. ఓటమి ఏంటి అని తెగ బాధ పడిపోయారు కేతిరెడ్డి. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే కేతిరెడ్డిని వెర్రిబాగులోడు అంటూ తేల్చి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు ఒకరు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో..
అప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి నియోజకవర్గం లో పర్యటించారు. అన్ని వర్గాల ప్రజలను పలకరించేవారు. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. అయితే తన పాపులారిటీని పెంచేందుకే కేతిరెడ్డి ఈ తరహా ప్రయత్నం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆయనతోపాటు అనుచరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. అది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే అప్పట్లో అలా చేసేవారన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ ఇది తెలుగు ప్రజలకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని దగ్గరకు చేర్చిన కార్యక్రమం మాత్రం గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకుడిగా ముద్రపడిన కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో ఏది జరగలేదు..
వాలంటీర్ వ్యవస్థతో సర్వనాశనం చేసేసారని.. అందుకు కేతిరెడ్డి లాంటివారు బాధితులని కె ఎస్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఉదయం కారులో బయలుదేరి వీధులన్నీ తిరిగి.. సమస్యలు తెలుసుకుని వాలంటీర్ను అడిగితే.. మా సార్ కాదని చెప్పారని చెప్పేవారని గుర్తు చేశారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వృధా ప్రయత్నం అని తేల్చి చెప్పారు కేఎస్ ప్రసాద్. ఇటీవల సాక్షి మీడియాకు ఆయన వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలను బయట పెడుతున్నారు. నాయకుల తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై పడ్డారు.