Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Reaction On Lokesh Promotion: "కూటమి స్ఫూర్తి".. లోకేష్ నియామకం పై...

Pawan Kalyan Reaction On Lokesh Promotion: “కూటమి స్ఫూర్తి”.. లోకేష్ నియామకం పై పవన్ స్పందన

Pawan Kalyan Reaction On Lokesh Promotion: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. ఆ పార్టీ బాధ్యతలను మూడో తరానికి అప్పగించింది. యువనేత నారా లోకేష్ కు టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. ఆయనకే కాదు యువనేతలకు చాలామందికి అవకాశాలు దక్కాయి టిడిపి కార్యవర్గంలో. ముఖ్యంగా పొలిట్ బ్యూరోలో చాలామంది నేతలకు అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు. పార్టీ జాతీయ కార్యవర్గాలతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో సైతం యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ టీం అన్నట్టు ఈ కార్యవర్గాలు ఉన్నాయి. టిడిపి ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు అవుతోంది. మరో నాలుగు దశాబ్దాలకు అన్నట్టు ఈ పాలకవర్గాలు ఉన్నాయి. అయితే టిడిపి అంతర్గత వ్యవహారం కావడంతో జనసేన స్పందించలేదు.

* చిన్నపాటి వైరుధ్యాలు..
తెలుగుదేశం పార్టీతో అడుగులు వేస్తోంది జనసేన. అయితే సీఎంగా చంద్రబాబు ఉండగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. క్యాబినెట్ మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని టిడిపి శ్రేణులు కోరాయి. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవిలో భాగస్వామ్యం కల్పించాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో రెండు పార్టీలు స్పందించి బాహటంగా ఈ విషయంపై మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు సూచించాయి. అయితే ఇప్పుడు అదే లోకేష్ కు తెలుగుదేశం పార్టీలో కీలక పదవి దక్కింది. పేరుకే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కానీ అన్ని రకాల నిర్ణయాలు లోకేష్ ఇక నుంచి తీసుకుంటారు. అయితే ఈ విషయంలో నిన్నటి వరకు జనసేన స్పందించలేదు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

* ఈరోజు స్పందించిన పవన్..
లోకేష్ పదోన్నతిపై టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. చాలామంది సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఈరోజు స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన అధికారిక గ్రూపులో ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సహచర మంత్రి, సోదరుడు నారా లోకేష్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రకటనలో తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేష్ కొత్త బాధ్యతలతో సఫలీకృతులు కావాలని.. కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాస్ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి అయితే కూటమి స్ఫూర్తి అంటూ పవన్ వ్యాఖ్యలు కొనసాగడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular