Pawan Kalyan counter to Nara Lokesh: ఆంధ్రా, తెలంగాణ అని బేధాలు లేకుండా అందరూ తెలుగు వాళ్ళమే అని అనుకున్నప్పుడే రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. జనాల మధ్య అలాంటి బేధాలు ఏమి లేవు, ఉన్నప్పటికీ చాలా తక్కువగా ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు మాత్రం ప్రాంతాల వారీగా విభజిస్తూ మాట్లాడుతుంటారు, విద్వేషాలు రెచ్చగొడుతుంటారు, అలా చేసినందుకు ఎవరైనా వేలెత్తి చూపిస్తే, జనాల మధ్య కుల , మాత, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రివర్స్ ఎటాక్ చేస్తుంటారు. ఇలాంటి మనుషులు ఉన్న ఈ సమాజం లో ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడి, ఇలా ఉండకూడదు అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గానే అసెంబ్లీ లో అమరావతి ని శాశ్వత రాజధాని గా తీర్మానిస్తూ ఒక చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం పొట్టి శ్రీరాములు, ఆయన కృషి తోనే నేడు మన ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది , అదే బాటలో బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అలా ఎన్నో బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైన మన ఆంధ్ర ప్రదేశ్ కి గత పదేళ్లుగా రాజధాని లేకపోవడం దురదృష్టకరం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణ అంటూ విభజించి కొందరు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, మనమంతా తెలుగు వాళ్ళం, మనది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి.
Also Read: చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్నాడు.. కానీ తానే తిన్నాడు
ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడుతూ ‘మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అది కావాలి , ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్నారు’ అని అంటాడు. దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ పై విధంగా రెస్పాన్స్ ఇచ్చాడు.మనలో మనం ఇది సబ్ రీజనల్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ రక్షించలేరు, ఇక్కడ ఎంతో గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారు, మీరంతా జనాల వద్దకు వెళ్లి మనమంతా ఒక్కటే అని అర్థం అయ్యేలా చెప్పాలి, ఆ విధంగా మన పని తీరు ఉండాలి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన పూర్తి వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.