Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan emotional tweet: ప్రకాష్ రాజ్ తల్లి మరణం.. పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్...

Pawan Kalyan emotional tweet: ప్రకాష్ రాజ్ తల్లి మరణం.. పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్ వైరల్.. ఇది ఎవ్వరూ ఊహించలేదు..

Pawan Kalyan emotional tweet: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తల్లి సువర్ణలత (86 ఏళ్ళు) నేడు తుది శ్వాస విడిచింది. వృదాప్యంతో గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సువర్ణలత, సోమవారం ఉదయం, బెంగళూరు లోని తన స్వగృహంలో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నేడు సాయంత్రం లో బెంగళూరు లో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయట. గతంలో ఒక అంతర్జాతీయ సదస్సులో తన తల్లి గురించి మాట్లాడుతూ ‘ మా […]

Pawan Kalyan emotional tweet: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తల్లి సువర్ణలత (86 ఏళ్ళు) నేడు తుది శ్వాస విడిచింది. వృదాప్యంతో గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సువర్ణలత, సోమవారం ఉదయం, బెంగళూరు లోని తన స్వగృహంలో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నేడు సాయంత్రం లో బెంగళూరు లో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయట. గతంలో ఒక అంతర్జాతీయ సదస్సులో తన తల్లి గురించి మాట్లాడుతూ ‘ మా తల్లికి మెదడు లో కణితికి సర్జరీ చేశారు. ఆ సమయంలో ఆమె మూడు రోజుల పాటు మెమరీ లాస్ కి గురైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె మళ్లీ తిరిగి కోలుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా సమయం దొరికినప్పుడల్లా తన తల్లి గురించి ప్రకాష్ గొప్ప మాట్లాడుతూ ఉండేవాడు. అలా తానూ ఎంతగానో ఆరాధించే తల్లి చనిపోవడం ప్రకాష్ రాజ్ కి తీరని లోటు అనే చెప్పాలి.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ కి సోషల్ మీడియా ద్వారా సినీ, రాజాక్షీయుల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఉండడం విశేషం. ఆయన మాట్లాడుతూ ‘ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి మాతృ మూర్తి శ్రీమతి స్వర్ణలత గారు నేడు కన్నుమూశారని విషయం తెలిసి చింతించాను. శ్రీమతి స్వర్ణలత గారి ఆమెకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగాన్ని లోనైనా ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ లు రాజకీయంగా ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకున్నారో మన అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు కానీ, ప్రకాష్ రాజ్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ప్రకాష్ రాజ్ తో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అలా రాజకీయ పరంగా ఇద్దరు ఒకరిని ఒకరు విమర్సించుకున్నా, సినిమాల పరంగా వస్తే మాత్రం కలిసి నటిస్తారు, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ప్రకాష్ రాజ్ తనపై ఘాటు విమర్శలు చేసినప్పటికీ కూడా , రీసెంట్ గానే ఓజీ చిత్రం లో కలిసి నటించారు. ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ వేయడం శుభ పరిణామం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper