Homeఆంధ్రప్రదేశ్‌Plan to shock Chandrababu: చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్నాడు.. కానీ తానే తిన్నాడు

Plan to shock Chandrababu: చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్నాడు.. కానీ తానే తిన్నాడు

Plan to shock Chandrababu: వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి( alla Ramakrishna Reddy) హైకోర్టులో షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఆదిలోనే కొట్టివేసింది హైకోర్టు. ఇటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పి ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. గతంలో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసుకునేవారు. 2014లో ఆయన మంగళగిరి నుంచి గెలిచారు. అప్పుడు వైయస్సార్ […]

Plan to shock Chandrababu: వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి( alla Ramakrishna Reddy) హైకోర్టులో షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఆదిలోనే కొట్టివేసింది హైకోర్టు. ఇటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పి ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. గతంలో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసుకునేవారు. 2014లో ఆయన మంగళగిరి నుంచి గెలిచారు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. టిడిపి ప్రభుత్వం పై ఆయన చాలా రకాలుగా న్యాయం పోరాటం చేశారు. అయితే అప్పట్లో వేసిన పిటిషన్ల పై ఏసీబీ విచారణ చేపట్టింది. అయితే ఇప్పుడు అదే ఏసీబీ ఆ విచారణ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూనే ఉన్నారు.

విచారణ జాప్యానికి..
ఒక పిటిషన్ కాకపోతే ఇంకో పిటిషన్ వేసి విచారణను జాప్యం చేయాలన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది. అందుకే తాజాగా ఆయన ఈ కేసు విచారణకు సంబంధించి మూడు అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు లేని కేసుగా పరిగణించిన కోర్టు ప్రాథమికంగానే గుర్తించి రద్దు చేసింది. గతంలో కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ లో ఏకంగా 5000 పేజీలతో విచారణ అంశాలను పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూప లేకపోయింది. ఇప్పుడు అదే ఏసీబీ కోర్టుకు కేసులను డిస్మిస్ చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలో పిటిషనర్ గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరు కాకుండా ఇదే దర్యాప్తును వేరే సంస్థలతోపాటు మూడు రకాల అంశాల్లో దర్యాప్తు చేయాలని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు అదే పిటిషన్లు హైకోర్టులో డిస్మిస్ అయ్యాయి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ నేతలు వీరే.. దేశాన్ని లీడ్ చేస్తున్నారు

జగన్ కరుణ కోసం..
ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి నుంచి గెలిచారు. 2019లో ఏకంగా మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే జగన్ కళ్ళల్లో ఆనందం కోసం నిత్యం చంద్రబాబుపై న్యాయపోరాటం చేసేవారు. ముఖ్యంగా అమరావతిలో చాలా రకాల తప్పిదాలు జరిగాయి అన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణ. అయితే కోర్టులో అది నిరూపితం కాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి మళ్లీ వైసీపీలోకి వచ్చేసారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆయనకు ఎటువంటి బాధ్యతలు లేవు. అందుకే మరోసారి రాజకీయం చేసేందుకు గాను ఇప్పుడు చంద్రబాబుపై పిటిషన్లు వేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ పిటిషన్లన్నీ హైకోర్టు రద్దు చేయడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్ద షాక్ తగిలినట్లే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper