spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Visakhapatnam visit: విశాఖకు లోకేష్.. వైసీపీకి మైండ్ బ్లాక్

Nara Lokesh Visakhapatnam visit: విశాఖకు లోకేష్.. వైసీపీకి మైండ్ బ్లాక్

Nara Lokesh Visakhapatnam visit: ఏపీలో యువ నేత నారా లోకేష్( Nara Lokesh) విషయంలో ఏది జరిగినా వార్త. గత పది రోజులుగా ఆయన పెద్దగా కనిపించలేదు. అయితే లోకేష్ ఎక్కడ అంటూ ఎక్కువగా ఆరా తీసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే భూతద్దంలో పెట్టి వెతికారు కూడా. సాక్షిలో చిన్న బాబు ఎక్కడ అని పతాక శీర్షికన కథనం కూడా రాశారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ కనీసం ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్టు అని ప్రశ్నించారు. అదేదో తమ ప్రశ్న కాదన్నట్టు.. టిడిపిలోనే చిన్న బాబు కనిపించకపోవడం పై చర్చ జరుగుతోందని.. కూటమిలో కూడా దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోందని సాక్షిలో ఒక కథనం వచ్చింది. అయితే లోకేష్ ప్రభుత్వ పరంగా విదేశీ పర్యటనకు వెళితే కచ్చితంగా తన షెడ్యూల్ ప్రకటించాలి. ప్రైవేటు పర్యటనకు వెళ్తే ఎవరికీ చెప్పాల్సిన పని ఉండదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓకే రకమైన ఆందోళన. అందుకే లోకేష్ కనిపించకపోయేసరికి దానిని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి.. ప్రచారంపై లేని పోనీ అనుమానాలకు తావిచ్చింది.

విమానాశ్రయంలో ప్రత్యక్షం..
అయితే ఈరోజు నారా లోకేష్ విశాఖ విమానాశ్రయంలో( Vishakha airport ) ప్రత్యక్షం అయ్యారు. చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి విమానాశ్రయానికి. పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. అసలు లోకేష్ ఎక్కడికి వెళ్లారు? అనే చిక్కుముడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీడలేదు. లోకేష్ వెళ్ళింది వ్యక్తిగత పర్యటన నిమిత్తం. దానిని కూడా తట్టుకోలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ గోప్యత వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఆ పార్టీకి అంతుపట్టడం లేదు. దీనికి తోడు విశాఖ విమానాశ్రయంలో లోకేష్ స్వాగతం చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతోంది.

గోప్యత వెనుక ఆందోళన..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన ఆందోళన కోసమే లోకేష్ పర్యటనను గోప్యంగా ఉంచినట్లు అర్థం అవుతోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరగనుంది. లోకేష్ ప్రత్యేక చొరవతోనే ఈ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ప్రత్యుత్తరాలు జరుపుతూ.. పట్టు గూగుల్ సంస్థతో ప్రభుత్వం తరుపున చర్చిస్తూ.. ఒప్పించడంలో లోకేష్ పాత్ర ఉంది. ఈనెల 18 నుంచి కనిపించకుండా పోయిన లోకేష్ ఈరోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయ్యారు. జాబ్ క్రియేటర్ ఆఫ్ చీఫ్ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. లోకేష్ కు స్వాగతం పలకడం విశేషం. అసలు ఏం జరుగుతుందో వైసీపీకి అర్థం కాని పరిస్థితి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular