Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Delhi Visit 2026: ఢిల్లీకి లోకేష్.. వైసీపీలో టెన్షన్

Nara Lokesh Delhi Visit 2026: ఢిల్లీకి లోకేష్.. వైసీపీలో టెన్షన్

Nara Lokesh Delhi Visit 2026: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) ఢిల్లీ బాట పట్టారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సంతకం చేయడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి తో పాటు రైల్వే శాఖ మంత్రులను కలిసి.. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడతారు. అయితే లోకేష్ ఢిల్లీ ఎప్పుడు వెళ్లిన ఒక […]

Nara Lokesh Delhi Visit 2026: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) ఢిల్లీ బాట పట్టారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సంతకం చేయడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి తో పాటు రైల్వే శాఖ మంత్రులను కలిసి.. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడతారు. అయితే లోకేష్ ఢిల్లీ ఎప్పుడు వెళ్లిన ఒక ప్రత్యేక అజెండాతోనే ఉంటుందన్న విషయం తెలిసిందే. లోకేష్ ఢిల్లీ పర్యటన ఆర్భాటాలకు దూరంగా కూడా ఉంటుంది. దాని ఫలితాలు తర్వాత బయటకు వస్తాయి. ఇప్పుడు కూడా అదే అజెండాతో ముందుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపేందుకే అన్న టాక్ ఉంది. కానీ అదే సమయంలో కేంద్ర పెద్దలను కలిసి ఏపీ పరిస్థితులు పై చర్చిస్తారని కూడా తెలుస్తోంది.

* నేషనల్ మీడియా ఫోకస్..
లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే నేషనల్ మీడియా( National media) ఫోకస్ అంత ఆయన పైనే ఉంటుంది. గత కొద్దిరోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే నేషనల్ మీడియాలో లోకేష్ మెరవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నారని కొత్త ఆరోపణలు చేస్తోంది. మరోవైపు మొన్ననే ఢిల్లీ వెళ్లారు లోకేష్. ఆ సమయంలో రాజ్యసభ లాబీల్లో కనిపించారు. దానిని కూడా తప్పు పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏకంగా ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చర్చనీయాంశం అయింది.. ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి రాజ్యసభకు వస్తే ఎందుకీ ఉలికిపాటు అని ఎక్కువమంది ప్రశ్నించారు కూడా. ఇప్పుడు మరోసారి లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టడంతో.. ఎందుకై ఉంటుందన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.

* అప్పటివరకు సాధారణ నేత..
చంద్రబాబు అరెస్టు వరకు లోకేష్ ఒక సాధారణ నేత. చంద్రబాబు కుమారుడు గానే జాతీయస్థాయిలో సుపరిచితం. కానీ ఇప్పుడు జాతీయస్థాయిలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం లభిస్తుంది కేంద్ర పెద్దల నుంచి. అదే సమయంలో నేషనల్ మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడదు అదే. ప్రత్యేక జెండాతో లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టారట. దానికి తగ్గ ఫలితాలు ఆయన పర్యటన ముగిసిన అనంతరం వస్తాయి. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper