Homeఆంధ్రప్రదేశ్‌Roja Second Innings In Politics: సెకండ్ ఇన్నింగ్స్ కు రోజా రెడీ

Roja Second Innings In Politics: సెకండ్ ఇన్నింగ్స్ కు రోజా రెడీ

Roja Second Innings In Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ మాజీ మంత్రి రోజా వేరే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ రాజకీయాలను ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను విస్మరిస్తే వెంటనే తమిళ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే రోజాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలో […]

Roja Second Innings In Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ మాజీ మంత్రి రోజా వేరే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ రాజకీయాలను ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను విస్మరిస్తే వెంటనే తమిళ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే రోజాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలో టిడిపి పట్టు బిగిస్తోంది. మరోవైపు రోజా నాయకత్వాన్ని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే టిక్కెట్ల విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి.

* నగిరి టిక్కెట్ పై అనుమానం..
మొన్నటి ఎన్నికల్లోనే రోజాకు నగిరి ( nagiri ) టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానాలు వెంటాడాయి. అయితే ఈసారి తప్పకుండా రోజాను తప్పించాల్సిందేనని ఆ జిల్లాకు చెందిన సీనియర్ మాజీమంత్రి ఒకరు గట్టిగానే జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లోనే రోజాకు టికెట్ వద్దని వారించారట. కానీ ఆమెకు టికెట్ ఇవ్వకపోతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళుతుందని భావించి జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం ఆమెకు టికెట్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే సెకండ్ ఆప్షన్ గా రోజా తమిళ రాజకీయాలను ఎంపిక చేసుకున్నారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకె తరఫున ప్రచారం చేస్తున్నారు రోజా. ఇదంతా ముందు చూపులో భాగమేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

* తమిళనాడులో గుర్తింపు..
రోజా భర్త సెల్వమణి( Selvamani ) తమిళ దర్శకుడు. అక్కడ సినిమా రంగంతో పాటు రాజకీయ రంగాల్లో ఆయనకు పరిచయాలు ఎక్కువ. రోజా సైతం తమిళనాడులో నటిగా గుర్తింపు పొందారు. ఆమె ఆది నుంచి సీఎం స్టాలిన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఆమెను స్టాలిన్ సోదరిగా చూస్తారు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మొండి చేయి చూపితే.. వెంటనే తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని రోజా భావిస్తున్నారట. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది ఆమె విషయంలో. ఒకవేళ పార్టీలో కొనసాగితే కొనసాగని.. లేకుంటే వెళ్లిపోని అని సింపుల్ గా తీసుకుంటుందట. పైగా ఏపీ రాజకీయాలతో విసిగిపోయిన రోజా.. సెకండ్ ఇన్నింగ్స్ తమిళ రాజకీయాలు అని పొలిటికల్,సినీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. చూడాలి ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper