Nara Lokesh: ఏ రాజకీయ పార్టీకైనా బలమైన కార్యవర్గం ఉండాలి. కార్యకర్తలు దృఢంగా ఉండాలి. అలా ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. కాకపోతే ఎన్నికలలో ఈ లెక్కలు పనిచేయవు. ఎందుకంటే ఎన్నికలుంటేనే ఖర్చులుంటాయి.. ఖర్చులు పెట్టుకునే వాళ్లకే పార్టీలు టికెట్లు ఇస్తాయి. కార్యకర్తలు మాత్రం జెండాలు మోసే కూలీలుగానే మిగిలిపోతారు. ఈ సూత్రాన్ని కాస్త పక్కన పెట్టి.. ఏపీ రాజకీయాలలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు టిడిపి కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్.
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఆర్థిక నేపథ్యం లేని కార్యకర్తలకు నారా లోకేష్ తిరుగులేని ప్రాధాన్యం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మునిసిపల్ ఎన్నికల్లో పెద్ద పీట వేశారు నారా లోకేష్. రాజకీయ వారసత్వం.. ఆర్థిక బలం కంటే.. పనిచేసే కార్యకర్తలే పార్టీకి కొండంత అండ అని భావించారు. అటువంటి వారికి టికెట్లు కేటాయించారు. ఎటువంటి నేపథం లేకపోయినప్పటికీ.. వారికి టికెట్లు కేటాయించి పార్టీకి కావలసింది.. కేవలం బలమైన కార్యకర్తలే అని లోకేష్ చేతల్లో చూపించారు.
ఉదాహరణకు తిరుపతి కార్పొరేషన్ ను తీసుకుంటే.. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుర్రం బాలయ్యకు 14వ డివిజన్ టికెట్ కేటాయించారు. బాలయ్య తొల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఇక విద్యార్థి సంఘం టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే హేయంత్ రాయల్ తల్లి రుక్మిణమ్మకు 13వ డివిజన్ టికెట్ కేటాయించారు. ఇక వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక్కడిగా కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి.. నిలబడిన ఆర్సి మునికృష్ణకు 47 డివిజన్ బాధ్యతలు అప్పగించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి జైలు జీవితాన్ని గడిపిన మహేష్ యాదవ్.. ఆర్పి శ్రీనివాసులకు గుర్తింపు కల్పించారు. మహేష్ సోదరుడు నైనార్ రమేష్ కు రెండవ డివిజన్ కేటాయించారు. ఆర్పి శ్రీనివాసులకు 48వ డివిజన్ కేటాయించారు. ఆనంద్ యాదవ్ కు 19వ డివిజన్ కేటాయించారు. శ్రీహరి నాయుడు కి తొమ్మిదవ డివిజన్ కేటాయించారు.. పార్టీ కోసం పని చేసిన వారందరికీ లోకేష్ సముచిత స్థానం కల్పించారు. లోకేష్ ఆదేశాలలో క్షేత్రస్థాయిలో శాప్ చైర్మన్ రవి నాయుడు.. నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అమలు చేశారు. తద్వారా కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు.
సామాన్య కార్యకర్తలకు ఈ స్థాయిలో గౌరవం కల్పించి.. ఏకంగా కార్పొరేట్ పదవులు దక్కేలా చేసి.. వారి జీవితంలో సరికొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన లోకేష్.. ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్లలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పెట్టినప్పుడు చాలామంది యువకులకు అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించి.. వారు రాజకీయంగా ఎదగడానికి కృషి చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో రాజకీయాలలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు నారా లోకేష్ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. యువతను పార్టీకి మరింత దగ్గర చేస్తూ.. రాజకీయాలలో సరికొత్త విధానాలను అమలు చేస్తున్నారు.