Homeఎంటర్టైన్మెంట్Scene Movie: సూర్య 'సీన్' మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ ఇలా ఉందేంటి!

Scene Movie: సూర్య ‘సీన్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ ఇలా ఉందేంటి!

Scene Movie: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పీక్ రేంజ్ ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ‘కరుప్పు’ చిత్రం తో కళ్ళు చెదిరే రేంజ్ కం బ్యాక్ ఇచ్చి ఏకంగా 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సూర్య, విశ్వనాధ్ & సన్స్ చిత్రం తో 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఆయన నుండి […]

Scene Movie: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పీక్ రేంజ్ ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ‘కరుప్పు’ చిత్రం తో కళ్ళు చెదిరే రేంజ్ కం బ్యాక్ ఇచ్చి ఏకంగా 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సూర్య, విశ్వనాధ్ & సన్స్ చిత్రం తో 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఆయన నుండి ఈ నెల 6 న ‘సీన్’ అనే చిత్రం విడుదల కాబోతుంది. మలయాళం స్టార్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జెన్ జీ యూత్ ఆడియన్స్ లో పీక్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో నస్లేన్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. రన్ టైం దాదాపుగా 2 గంటల 29 నిమిషాల వరకు ఉంటుందట. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని లండన్ లోని ఒక టాప్ థియేటర్ లో కొంతమంది ఓవర్సీస్ బయ్యర్స్ కి ప్రదర్శించి చూపించారట మేకర్స్. వాళ్ళ నుండి లీకైన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది. మలయాళం డైరెక్టర్స్ సాధారణంగానే ఇలాంటి జానర్ సినిమాలను చాలా అద్భుతంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాంటిది సూర్య , నస్లేన్ లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు అంటే ఏ రేంజ్ లో ఆడియన్స్ అంచనాలు పెట్టుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా , అంతకు మించే ఉంటుందట ఈ చిత్రం.

ఫస్ట్ హాఫ్ మొత్తం సూర్య ఊర మాస్ యాటిట్యూడ్ , నస్లేన్ సైకో పాత్ సన్నివేశాలు ఆడియన్స్ కి పీక్ థియేట్రికల్ అనుభూతి ఇస్తుందట. ఇంటర్వెల్ సన్నివేశం ఈ చిత్రానికి ప్రధానమైన హైలైట్ అని , సూర్య , నస్లేన్ మధ్య వచ్చే క్లాష్ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఒక్క క్షణం బోర్ కొట్టకుండా ఉండేలా చూసుకున్నాడట డైరెక్టర్ జీతూ మాధవన్. సాధారణంగా మలయాళం సినిమాలు చాలా స్లో గా ఉంటాయి అనే కంప్లైంట్ ఉంటుంది. కానీ ఈ సినిమాకు అలాంటి కంప్లైంట్స్ ఉండవట. స్క్రీన్ ప్లే జెట్ స్పీడ్ లో నడుస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే , నస్లేన్ క్యారెక్టర్ సూర్య నే డామినేట్ చేసే విధంగా ఉంటుందని , ఇన్ని రోజులు అమాయకమైన సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన నస్లేన్ లో ఈ రేంజ్ విలనిజం ఉంటుందని అసలు ఊహించలేదు అనే భావన ప్రతీ ఒక్కరిలో కలుగుతుందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని , జెన్ జీ ఆడియన్స్ మెంటలెక్కిపోతారని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం పై మీకున్న అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper