Venugayya Naidu Death Controversy: చిక్కటి చిరునవ్వుతో సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇతడిని కూడా పరామర్శించాలి.. రోడ్డు వెయ్యమని అడగడమే అతడు చేసిన పాపం. అలా అడిగినందుకు అతడికి ఊపిరి లేకుండా చేశారు. సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడంలో పోటీపడిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఇతడి కుటుంబాన్ని పరామర్శిస్తాడా.. తాను అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే చేసిన దారుణాన్ని గుర్తిస్తాడా.. కులాల మీద రాజకీయాలు చేసి.. శవాల మీద రాజకీయాలు చేసి.. అధికారాన్ని దక్కించుకున్న జగన్.. ఒకసారి ఈ వ్యక్తి కుటుంబాన్ని చూడాలని.. తన ఎమ్మెల్యే చేసిన దారుణం గురించి బయట ప్రపంచానికి చెప్పాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి నేతలు చెప్పిన వివరాల ప్రకారం.
అతని పేరు వెంగయ్య నాయుడు.. ఇతడి మీద రౌడీషీట్ లేదు. నేర చరిత్ర కూడా లేదు. ఇతడిది కాపు సామాజిక వర్గం. ఇతడు తన ఊరికి ఒక రోడ్డు వేయాలని స్థానికంగా అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబును అడిగాడు. సరిగ్గా 2021 సింగర్ పల్లి అనే గ్రామంలో జనవరి 23న అన్నా రాంబాబు పర్యటించారు. ఆ సమయంలో వెంగయ్య నాయుడు తమ గ్రామంలో రోడ్డు వేయాలని ఎమ్మెల్యేని ప్రశ్నించాడు. సరిగా మరుసటి రోజు వెంగయ్య నాయుడు కన్నుమూశాడు.
నాడు ఎమ్మెల్యేను రోడ్డు గురించి అడిగితే ఆయన మాట్లాడిన బూతులు మామూలుగా లేవు. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అప్పటికి వెంగయ్య నాయుడు ఎమ్మెల్యే తిడుతున్నప్పటికీ సార్ సార్ అంటూనే మాట్లాడుతున్నాడు. మరుసటి రోజు వెంకయ్య నాయుడు చనిపోవడం అప్పట్లో కలకలం సృష్టించింది. మరి ఇతడి కుటుంబాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సిన అవసరం ఉందని టిడిపి నేతలు అంటున్నారు. సాయి కృష్ణకు కాపు కులాన్ని అంటగట్టి తన సొంత మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్.. వెంగయ్య నాయుడు విషయంలో కూడా అలానే వ్యవహరించాలని టిడిపి నేతలు కోరుతున్నారు.
“ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. సావధానంగా సమాధానం చెప్పలేదు. ఎదురుదాడికి దిగారు. ప్రాణాలు కూడా తీశారు. ఒక సామాన్యుడి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇటువంటి ఘటనను ఏపీ సమాజం ఎలా మర్చిపోతుంది.. ఒక నిరుపేద కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. ఆ రాక్షసానికి ఏం పేరు పెట్టాలి. రోడ్డు వేయాలని అడిగితే అడ్డగోలుగా తిట్టారు. అతడి రక్తం కళ్ళ చూశారు. ప్రశ్నించినందుకు ప్రాణాలు తీశారు. వెంకయ్య నాయుడు చనిపోయాడు. అతని మరణం.. ఎంతోమందికి ప్రశ్నించే అధికారాన్ని ఇచ్చింది. అందువల్లే 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీని పరిమితం చేసిందని” టిడిపి నేతలు పేర్కొంటున్నారు.
