Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: 9న పెద్ద ఎత్తున రూంల బుకింగ్.. ఏపీలో ఏం జరుగుతోంది?

AP Elections 2024: 9న పెద్ద ఎత్తున రూంల బుకింగ్.. ఏపీలో ఏం జరుగుతోంది?

అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గాను పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయవాడలో సైతం సందడి నెలకొంది. విజయవాడలో పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు సైతం రిజర్వ్ అయ్యాయి.

AP Elections 2024: ప్రత్యేకంగా కొన్ని తేదీలకు గుర్తింపు ఉంటుంది. ఆరోజు అందరికీ గుర్తుండిపోతుంది. అయితే ఇటీవల ఓ తేదీ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడం విశేషం. పోలింగ్ ప్రక్రియ మే 13న జరగగా.. కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. అందరి దృష్టి ఫలితాలపై ఉండగా.. జూన్ 9 పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. అదేరోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తంగా నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో సీఎం జగన్ అదే రోజు ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే రోజు చంద్రబాబు సైతం అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు.

అయితే అటు హైదరాబాదు నుండి విశాఖకు, అదే సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడకు విమాన టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. అటు చాలామంది ట్రైన్ టికెట్లకు సంబంధించి రిజర్వేషన్లు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో పేరు మోసిన హోటళ్లు, ఫామ్ హౌస్ లు ముందుగానే రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో సైతం ఖాళీలు చూపించడం లేదు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? లేకుంటే నిజంగా బుక్ అయ్యాయా? అన్నది తెలియాల్సి ఉంది.

అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గాను పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయవాడలో సైతం సందడి నెలకొంది. విజయవాడలో పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు సైతం రిజర్వ్ అయ్యాయి. మరోవైపు శివకాశిలో పెద్ద ఎత్తున బాణసంచా సైతం బుక్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ దద్దరిల్లేలా పెద్ద ఎత్తున బాణసంచా ముందుగానే కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా జూన్ 9 కి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామస్థాయిలో సంబరాలు జరుపుకునేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ దేవత పండుగలు, డీజేల హోరుతో విజయాన్ని ఆస్వాదించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. అయితే అన్ని వేడుకలు జూన్ 9 చుట్టూ తిరగనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper