Homeఎంటర్టైన్మెంట్Nuvvu Naaku Nachav Movie: నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ బ్లండర్ మిస్టేక్ గమనించారా?...

Nuvvu Naaku Nachav Movie: నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ బ్లండర్ మిస్టేక్ గమనించారా? త్రివిక్రమ్ కి ఈ మాత్రం తెలియదా!

Nuvvu Naaku Nachav Movie: విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా… త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఈ చిత్రం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. వెంకీ, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు గమ్మత్తుగా ఉంటాయి. సునీల్, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది అని చెప్పొచ్చు.

నువ్వు నాకు నచ్చావ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా కనిపించింది. పింకీ క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రతి సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండటం చాలా కామన్. అప్పట్లో వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో నెటిజన్లు లాజిక్కులు వెతుకుతున్నారు. ప్రతిదాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అలాంటి మిస్టేక్ ఒకటి
వెలికి తీసి ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

ఈ చిత్రంలో పింకీ క్యారెక్టర్ కూడా నవ్వులు పూయించే విధంగా ఉంటుంది. వెంకటేష్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం సిటీ కి వస్తాడు. ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చిన సమయంలో పింకీ, వెంకటేష్ మధ్య ఒక కామెడీ సన్నివేశం ఉంటుంది.పింకీ తన ఇంట్రో వెంకీకి చెబుతూ… పేరు, చదివే స్కూల్, అడ్రస్ అన్ని చెబుతుంది. తన స్కూల్ పేరు లిటిల్ క్లాస్ అని, తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు చెబుతుంది.

blunder mistake in Nuvvu Naaku Nachav Movie
blunder mistake in Nuvvu Naaku Nachav Movie

కానీ పింకీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు వేరే స్కూల్ బస్ ఎక్కుతుంది. ఆ బస్సు పై బివిబిపి స్కూల్ అని రాసి ఉంది. స్కూల్ పేరు లిటిల్ క్లాస్ అని చెప్పి మరో స్కూల్ బస్సు ఎక్కడం ఏంటని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఈ మాత్రం తెలియదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రాన… నువ్వు నాకు నచ్చావ్ వంటి మంచి చిత్రాన్ని ట్రోల్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular