Homeఆంధ్రప్రదేశ్‌Jr NTR wishes Chandrababu: చంద్రబాబు విషయంలో ప్రత్యేకత చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR wishes Chandrababu: చంద్రబాబు విషయంలో ప్రత్యేకత చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR wishes Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పుట్టినరోజు ఈరోజు. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల వారు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అన్నింటికీ మించి ఒకరి విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా చంద్రబాబు జాతీయ నాయకుడిగా ఎదిగారు. జాతీయస్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపు సాధించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ […]

Jr NTR wishes Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పుట్టినరోజు ఈరోజు. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల వారు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అన్నింటికీ మించి ఒకరి విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా చంద్రబాబు జాతీయ నాయకుడిగా ఎదిగారు. జాతీయస్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపు సాధించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి మంత్రులు దాకా అందరూ తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరి విషెస్ మాత్రం ప్రత్యేకం. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మామయ్య అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానిస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో జూనియర్ ఎన్టీఆర్ విభేదించినట్లు గత కొద్ది సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు పుట్టినరోజు నాడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.

ప్రత్యర్థులు అదేపనిగా ప్రచారం..
నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబు, లోకేష్ ను జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) విభేదిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే అదునుగా టిడిపి రాజకీయ ప్రత్యర్థుల సైతం ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రయోగిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల కు ముందు ఏ సభలో చూసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చేవారు కొందరు. తెలుగుదేశం పార్టీని అస్థిర పరిచేందుకు.. చంద్రబాబుతో పాటు లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడేవారు. అయితే తారక్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి పెడుతూ వచ్చారు. కానీ అన్ని సందర్భాల్లో స్పందించారు తారక్. చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించక పోయేసరికి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అది వివాదాస్పద అంశం కావడంతో అప్పట్లో తారక్ వ్యక్తిగతంగా చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది. ఎన్ని రకాల విభేద వార్తలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు విషయంలో వీర విధేయత కనబరుస్తూ వచ్చారు.

అప్పట్లో ఎంతో ప్రోత్సాహం..
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా కేర్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కు తన సమీప బంధువు అయిన ప్రణతి తో వివాహం చేయించింది చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంది చంద్రబాబు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. మధ్యలో కొందరు సృష్టించిన విభేదాలు తప్ప చంద్రబాబు పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ విధేయత గానే ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. అయితే క్రమం తప్పకుండా చంద్రబాబు జన్మదినం నాడు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పడం ప్రత్యేకంగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా అలానే విషెస్ చెప్పి టిడిపి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు తారక్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper