Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై గృహహింసకు పాల్పడ్డారని.. అదనపు కట్నం కోసం వేధించారని.. చివరకు చంపేందుకు కూడా ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త శారీరక సమస్యను కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వారు హిందువులు కాదని.. క్రిస్టియన్లు అంటూ ఆరోపించడం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. అయితే జోగి రమేష్ ఒక్కరే కాదు.. ఆ పార్టీలో చాలామంది నేతలు క్రిస్టియన్ మతం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

* జగన్ ప్రాపకం కోసం..
మత స్వీకరణ అనేది ఎవరి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసమే వైసీపీ నేతలు క్రిస్టియన్ మతంలోకి మారిపోయారు అంటూ కొత్త చర్చ ప్రారంభం అయింది. అయితే వారు బయటకు హిందువులు గాను.. లో లోపల మాత్రం క్రిస్టియన్ లాగా చలామణి అవుతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు జోగి రమేష్ కోడలు మేఘన ఆ విషయాన్ని బయటపెట్టారు. తనను సైతం బలవంతంగా క్రిస్టియన్ మతంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రాచీన సాంప్రదాయాలు, హిందూ పండుగలను ఆచరిస్తున్నట్లు కనిపించిన ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం.. ఇప్పుడు రహస్యంగా మతం మారినట్లు బయటకు వచ్చింది. ప్రజాప్రతినిధులుగా సమాజంలో చలామణి అవుతున్న నాయకులు తమ వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక నిష్ఠలను పారదర్శకంగా వెల్లడించకుండా.. దాచిపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు.

* ఏకంగా దుర్గమ్మ వద్ద ప్రమాణం..
కొద్ది రోజుల కిందట నకిలీ మద్యానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి జోగి రమేష్ పై. ఈ పరిస్థితుల్లో ఆయన విజయవాడ దుర్గమ్మ సన్నిధికి వచ్చి ప్రమాణం చేశారు. ఈ విషయంలో కూటమి నేతలకు సవాల్ కూడా చేశారు. తానేమి తప్పు చేయలేదని నాడు దుర్గమ్మ సన్నిధికి వచ్చి కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ వెంట ఉన్న కోడలు మేఘనా ఇప్పుడు.. నేరుగా కుటుంబం మతమార్పిడి చేస్కుందని ఆరోపించడం సంచలనం అవుతుంది. అంటే ఒక మతంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకో మత విశ్వాసాలను అనుసరించి ప్రమాణానికి సిద్ధపడటం వెనుక ఒక కుట్ర ఉంది అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే ఒక్క జోగి రమేష్ తో మాత్రమే ఇది ఆగిపోలేదు. వైసీపీలో చలామణి అయిన చాలామంది నేతలు ఇలా సీక్రెట్ గా మతమార్పిడులు చేసుకున్నారనేది ఒక ప్రధాన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం పొందడానికి, పార్టీతో పాటు పదవుల కేటాయింపులు ప్రాధాన్యత దక్కించుకోవడానికి ఇటువంటి మతమార్పిడులు జరిగాయని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అధిష్టానానికి అనుకూలంగా మా గ్రామంలో నేతలు తమ కుటుంబాల ఐడెంటిటీని, విశ్వాసాలను మార్చుకోవడానికి సిద్ధపడ్డారని అభిప్రాయం బలపడుతోంది. మరి తెర వెనుక ఏం జరిగిందో ఆ దేవుడికి ఎరుక.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AP Heavy Rains

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...
TDP MLC Candidates

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...
ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Oktelugu Epaper