Homeఆంధ్రప్రదేశ్‌Jogi family massive fraud: జోగి ఫ్యామిలీది ఘోరమైన మోసం... అంతా బయట పెట్టేసిన కోడలు!

Jogi family massive fraud: జోగి ఫ్యామిలీది ఘోరమైన మోసం… అంతా బయట పెట్టేసిన కోడలు!

Jogi family massive fraud: మాజీ మంత్రి జోగి రమేష్ తన కుటుంబాన్ని రాజకీయాల కోసం వీధిన పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలిని కుమార్తె కంటే బాగా చూసుకున్నానని ప్రకటించారు. ఇదంతా కల్పితం మాత్రమేనని.. దీని వెనుక చంద్రబాబు, లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారని.. పెద్ద పెద్ద వారి కుటుంబాల్లోనే వివాదాలు ఉన్నాయని.. తన కుటుంబంలో కేవలం తన కుమారుడు, కోడలి మధ్య విభేదాలు మాత్రమేనని.. తమ కోడలి ఫిర్యాదు […]

Jogi family massive fraud: మాజీ మంత్రి జోగి రమేష్ తన కుటుంబాన్ని రాజకీయాల కోసం వీధిన పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలిని కుమార్తె కంటే బాగా చూసుకున్నానని ప్రకటించారు. ఇదంతా కల్పితం మాత్రమేనని.. దీని వెనుక చంద్రబాబు, లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారని.. పెద్ద పెద్ద వారి కుటుంబాల్లోనే వివాదాలు ఉన్నాయని.. తన కుటుంబంలో కేవలం తన కుమారుడు, కోడలి మధ్య విభేదాలు మాత్రమేనని.. తమ కోడలి ఫిర్యాదు కంటే ముందే తాము విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నిన్ననే జోగి రమేష్ మీడియా ముఖంగా ప్రకటన చేశారు. నెల రోజులుగా క్షోభ అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జోగి రమేష్ కోడలు మేఘన, ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

కన్నీటి పర్యాంతమవుతూ..
తనకు అత్తవారింట్లో ఎదురైన పరిణామాల గురించి వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు మేఘన. సంసారానికి పనికిరాని లోపం కొడుకు జోగి రాజీవ్ కు ఉందని తెలిసి.. కేవలం పరువు, భారీ కట్నం కోసమే తమకు అబద్ధాలు చెప్పి మోసపూరితంగా పెళ్లి చేస్తారని మేఘన కుండబద్దలు కొట్టారు. మరింత అదనపు కట్నం తెస్తేనే నీ నీ భర్తకు ఫీలింగ్స్ వస్తాయి.. నువ్వు సంతోషంగా ఉంటావు అంటూ జోగి రమేష్ భార్య శకుంతల తనను చిత్రహింసలకు గురి చేసిందని మేఘన చెప్పారు. బయట సమాజానికి హిందూ సంప్రదాయ కుటుంబం గా బిల్డప్ ఇచ్చే జోగి రమేష్ ఇంట్లో.. అసలు స్వరూపం వేరని.. వారిది పక్కా క్రిస్టియన్ కుటుంబమని మేఘన ఆధారాలతో సహా బయటపెట్టారు.

హిందూ దేవుళ్లను దూషించేవారు..
కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన తనకు పూజ చేసేందుకు ప్రత్యేకమైన గది కూడా లేదని.. తాను హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టి పూజలు చేస్తుంటే అడ్డుకునేవారని కొచ్చారు. హారతి పళ్లాలు, అగరబత్తులను నేలకేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అత్త హిందూ దేవుళ్లను అసభ్యంగా దూషిస్తూ.. బలవంతంగా మతం మార్చేందుకు విపరీతంగా ఒత్తిడి చేశారని ఆరోపించారు. పెళ్లయిన కేవలం రెండు నెలలకి తనను వదిలించుకునే కుట్రతో జోగి రాజీవ్ కోర్టులో రహస్యంగా పిటిషన్ దాఖలు చేశాడు అన్న సంచలన విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. వివాహ సమయంలో కేజీన్నర బంగారం, కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చినా.. తమ కుమార్తెను అంతమొందించేందుకు ప్రయత్నించారని మేఘన తండ్రి మీడియా ముందు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.

మరోవైపు న్యాయం కోసం తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిశామని కూడా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేస్తే ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పరిస్థితిని వివరిస్తే ఆయన సమస్యను పరిష్కరించడం మానేసి కాలయాపన చేస్తూ రాజీ కుట్రలకు పాల్పడ్డారు. అన్ని దారులు మూసుకుపోవడంతో.. గత్యంతరం లేక స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నామని.. జోగి రమేష్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తమపై టిడిపి ముద్ర వేసి రాజకీయ రంగు పులిమారని మేఘన నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో జోగి రమేష్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జోగి రమేష్ ఫ్యామిలీ ది ఘోరమైన మోసం అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper