Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. టాస్కులు చాలా కఠినంగా ఉన్నాయి, కంటెస్టెంట్స్ కూడా తగ్గేదేలే అనే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగా ఉండడం తో , ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ కి ఆడియన్స్ లో హైప్ మామూలు రేంజ్ లో ఏర్పడలేదు , టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేటితో ఈ ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కానుంది. అంటే నేడు గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతుంది అన్నమాట.
25 వేల అప్లికేషన్స్ నుండి అనేక ఆడిషన్స్ ని ఎదురుకొని ఎంపిక అయినటువంటి 15 మందిలో ఇప్పటికే గాయత్రీ , భాగీ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన 13 మందిలో కేవలం 6 మంది మాత్రమే ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున హౌస్ లోపలకు వెళ్తారు. ఈ 6 మందిలో ముగ్గురు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్తారు , మరో ముగ్గురు జడ్జీల ద్వారా వెళ్తారు.అయితే ప్రస్తుతం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా టాప్ 3 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ రోహిత్ , అమన్ మసూద్ , చరణ్ మాత్రమే. మిగిలిన ముగ్గురిలో షాలిని , శ్రేష్టి వ్యాకరణం, రాజా కుమారి దయానా వంటి వారు జడ్జీల ద్వారా హౌస్ లోపలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోపలకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సీజన్ లో టాస్కులు కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గత సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అగ్ని పరీక్ష నుండి దివ్య నిఖిత వచ్చి ఏ రేంజ్ లో బిగ్ బాస్ పై తన ప్రభావం చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈసారి కూడా వైల్డ్ కార్డ్స్ ఆ రేంజ్ ఫైర్ ఉన్న కంటెస్టెంట్ ని దింపబోతున్నట్టు సమాచారం. ఝాన్సీ , హేమంత్, దీపక్ లలో ఇద్దరు వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ‘అగ్నిపరీక్ష 2’ లో 8 మందికి అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారు మేకర్స్. మరి వీళ్ళు షో పై ఎలాంటి ప్రభావం చూపిస్తారో, సెలబ్రిటీలతో ఎలా నడుచుకుంటారో చూడాలి.