Pawan Kalyan orders to party leaders: టీటీడీ లడ్డూ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సొంత పార్టీ నేతలకు సైతం కీలక టాస్క్ ఇచ్చారు. పార్టీ నేతలు సరిగ్గా స్పందించడం లేదని కూడా చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తో పాటు ఓ ఎంపీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే పవన్ ఆదేశించిన తర్వాత ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి లడ్డూ వివాదంపై మాట్లాడడం ప్రారంభించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన సీనియర్ నేత లడ్డూ వివాదంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
బాలినేని హాట్ కామెంట్స్..
ఇటీవల మాజీ మంత్రి, జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Srinivasa Reddy ) టీటీడీ లడ్డూ వివాదం పై మాట్లాడారు. అనవసరంగా దీనిని పెద్దది చేయవద్దు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించండి.. మీడియా సైతం ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ గట్టిగా నిలదీయాలని సూచిస్తుంటే.. అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఇలా మాట్లాడడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు బాలినేని పార్టీ లైన్ లోనే మాట్లాడుతున్నారా? ఇంకా వైసీపీ ఫ్లేవర్ లో ఉన్నారా? అన్న సెటైరికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏడాది కిందట చేరినా..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొన్ని నెలల కిందట జనసేన( janasena ) పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. అందుకే రాజశేఖర్ రెడ్డి ఎంతగానో రాజకీయంగా ప్రోత్సహించారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించారు కూడా. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మంత్రి అయ్యారు కూడా. ఆ కృతజ్ఞతతోనే మంత్రి పదవి విడిచిపెట్టి మరి బాలినేని జగన్ వెంట అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జగన్ బాలినేనిని తొలగించడం నుంచి వారి మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి. అనుకోని రీతిలో జనసేనలో చేరాల్సి వచ్చింది. అయితే దాదాపు ఏడాది అవుతోంది జనసేనలో చేరి. కానీ పదవుల పరంగా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత సూచనలకు భిన్నంగా బాలినేని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.