spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ex ministers warning to Jagan: జగన్ కు ఆ ముగ్గురు మాజీ మంత్రుల వార్నింగ్

Ex ministers warning to Jagan: జగన్ కు ఆ ముగ్గురు మాజీ మంత్రుల వార్నింగ్

Ex ministers warning to Jagan: జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) ముగ్గురు మాజీ మంత్రులు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ ముగ్గురు పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మార్గం రాజధాని ప్రతిపాదన చేసిన తర్వాత ప్రజల నుంచి అనేక రకాలుగా స్పందన వచ్చింది. సానుకూలత కంటే వ్యతిరేక ప్రచారమే అధికం. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. పైకి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కొంతమంది నేతలు సమర్థిస్తున్నారు కానీ.. వారి ముఖంలో మునుపటి ఆత్మవిశ్వాసం లేదు. ఆపై రాజకీయ వైరాగ్యం స్పష్టంగా కనిపించింది. ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని పేర్ని నాని లాంటి నేత అనడం వెనుక ఇదే ఉద్దేశం ఉంటుంది అనేది ఒక అనుమానం. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి షుగర్,బీపీలు తెచ్చుకున్నామని రోజా లాంటివారు వ్యాఖ్యానించారు. ఈ మాటల వెనుక రాజకీయ వైరాగ్యత స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా మావిగన్ రాజధాని ప్రతిపాదన తరువాత ఇటువంటి వ్యాఖ్యానాలు నేతల నోటి నుంచి వినిపించడం విశేషం.

ఇలా అయితే సమర్థించలేం..
రాజధానుల స్టాండ్స్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తరచు ఇలా స్టాండ్స్ మారుతుండడంతో ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. సమర్థత కూడా కొంతవరకు మాత్రమే పనిచేస్తుందని.. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని సమర్థించిన వారు ఈ నిర్ణయంతో మాత్రం షాక్ కు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మితే తమకు ఇబ్బందులు వస్తాయని తెలిసి కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు. ఓ ముగ్గురు మాజీ మంత్రులు మాత్రం పార్టీలో ఉండలేమని జగన్మోహన్ రెడ్డికి రాయబారం పంపినట్లు తెలుస్తోంది. నేరుగా వారు సజ్జల రామకృష్ణారెడ్డికి సమాచారం పంపినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ముగ్గురు ఎవరో అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు నడుస్తోంది.

కనీసం చర్చించాలి కదా..
పార్టీ పరంగా ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న సమయంలో అత్యున్నత నాయకులతో ఏర్పాటు చేసిన.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఎదుట ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు వైసిపి నేతలు. ఇది రాష్ట్ర ప్రజల అంశం.. పైగా ఇప్పటికే స్టాండ్స్ మార్చాం.. అమరావతిని కాదన్నాం సరే.. మూడు రాజధానుల అంశాన్ని పాలనా వికేంద్రీకరణలో భాగంగా తెరపైకి తెచ్చాం సరే.. కనీసం ఈ మావిగన్ ప్రతిపాదన చేసినప్పుడైనా పార్టీలో చర్చించాల్సి ఉండాలి కదా అని వైసిపి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదని ఆ ముగ్గురు మంత్రులు బాహటంగానే ఆక్షేపించినట్లు ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కష్టమని.. నిర్ణయాలతో ఇబ్బందులు అధినేత తెచ్చి పెడుతున్నారని భావించి ఆ ముగ్గురు నేతలు పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు అన్నది మాత్రం బయటపడటం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular