YSR Congress Internal Politics: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో జగన్ తర్వాత ఎవరు? అంటే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉండేవారు. మరోవైపు వై వి సుబ్బారెడ్డి ఉండేవారు. కానీ వారందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. అందరూ సజ్జల రామకృష్ణారెడ్డిని కార్నర్ చేశారు. సీనియర్లు సైతం ఆయన పై ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టబోతున్నారన్న ప్రచారం సాగింది. చివరకు సోషల్ మీడియా విభాగం సజ్జల భార్గవరెడ్డి చేతిలో ఉండగా.. ఆ బాధ్యతలను సైతం తీసుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే సీన్ కట్ చేస్తే అదే సజ్జల రామకృష్ణారెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు. సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి మళ్లీ సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించారు. అయితే ఇటీవల రెండో ప్లేస్ లోకి వచ్చేందుకు ఓ నేత ప్రయత్నాలు చేశారు. వర్కౌట్ కాలేదు సరి కదా.. ఆ నేత వద్ద ఉన్న వైసీపీ బాధ్యతల నుంచి జగన్మోహన్ రెడ్డి తొలగించినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ‘మూసీ’ రాజకీయం.. కంపు కొడుతోంది పో!
* జగన్ కు సన్నిహితం..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevy Reddy Bhaskar Reddy ) యాక్టివయ్యారు. చంద్రగిరి నుంచి రెండుసార్లు గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే గడిచిన ఎన్నికలకు ముందు ఆయన తన కుమారుడిని తెరపైకి తెచ్చి తాను తాడేపల్లి కార్యాలయానికి వస్తానని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే టీంలను నడుపుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సర్వేలు చేసి ఇస్తుంటారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని కావడంతో ఆయన ఒప్పుకున్నారు. తాడేపల్లి కి వచ్చిన చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గర కావాలన్నా ఆలోచన చేశారు. అయితే ఇంతలో ప్రకాశం జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒకవైపు ఒంగోలు పై దృష్టి పెడుతూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలని చూశారు. ఇంతలో మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు.
* దొరకని అపాయింట్మెంట్..
మద్యం కుంభకోణంలో( liquor scam ) అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. అటు తరువాత ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆయనకు నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి పదవి నుంచి తొలగించారట. ఇకనుంచి చంద్రగిరి నియోజకవర్గానికి పరిమితం కావాలని సూచించారట. ఎటువంటి సర్వేలు చేయకూడదని ఆంక్షలు పెట్టారట. ఇంకోవైపు ఆయన వద్ద ఉన్న సోషల్ మీడియా బాధ్యతలను లాక్కున్నారట. తిరిగి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారట. అయితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుమానిస్తున్నట్లు ప్రకారం నడుస్తోంది. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసినట్లు.. జగన్మోహన్ రెడ్డికి సజ్జల నూరిపోసినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్లు టాక్ ఉంది. అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.