Homeఆంధ్రప్రదేశ్‌Jagan Press Meet: జగన్ ప్రెస్ మీట్.. హడలెత్తిపోతున్న వైసీపీ సోషల్ మీడియా!

Jagan Press Meet: జగన్ ప్రెస్ మీట్.. హడలెత్తిపోతున్న వైసీపీ సోషల్ మీడియా!

Jagan Press Meet: జగన్ ప్రెస్ మీట్ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ బెదిరిపోతోంది. ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతారో.. దానిని ఎలా కవర్ చేయాలో తెలియడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి.. ప్రతివారం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాఫ్ లతోపాటు గణాంకాలు తెలియజెప్పే క్రమంలో ప్రజలకు అర్థం కావడం లేదు. పైగా ఆయన నోటి నుంచి […]

Jagan Press Meet: జగన్ ప్రెస్ మీట్ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ బెదిరిపోతోంది. ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతారో.. దానిని ఎలా కవర్ చేయాలో తెలియడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి.. ప్రతివారం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాఫ్ లతోపాటు గణాంకాలు తెలియజెప్పే క్రమంలో ప్రజలకు అర్థం కావడం లేదు. పైగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ప్రజల్లోకి వ్యతిరేకంగా దూసుకెళ్తున్నాయి. సోషల్ మీడియాకు వినోద వనరుగా మారిపోతున్నాయి.

* మావిగన్ తో ముప్పు తిప్పలు..
ఆయన ఆ మధ్యన మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు వారాంతపు ప్రెస్మీట్లో. మూడు నగరాలను కలిపి మావిగన్ అని పేరు పెడితే సరిపోతుంది కదా అంటూ సెలవిచ్చారు. దీంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఎలా సమర్థించాలో తెలియక వైసీపీ నేతలు కిందా మీదా పడ్డారు. చివరకు ఎలాగోలా సర్దుబాటు చేసి దానిని మరిచిపోయేలా చేస్తే.. మాదిగని పేరు చెబితేనే చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని.. ఆయనకు గుండె నొప్పి వచ్చినంత పని అవుతోందని సెలవిచ్చారు మరోసారి. అంతటితో ఆగకుండా తన ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని బయటపెట్టేశారు. ఇప్పటి తరానికి తెలియని కుటుంబ కథా చిత్రాన్ని విప్పి మరీ చూపించేశారు. కుటుంబం పై చర్చ జరిగేలా చేశారు జగన్మోహన్ రెడ్డి.

* కుటుంబ విషయాలు సైతం..
నిన్నటి వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక మహానేత. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. అటువంటి వ్యక్తి వెనుక ఇప్పుడు అనేక వివాదాలు, యాక్షన్ రాజకీయాలు ఉన్నాయని బయట పెట్టుకునేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజారెడ్డి చేసిన మంచి పనుల కంటే చెడ్డ పనులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితాలు బయటపడుతున్నాయి. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని ఆ పార్టీ సోషల్ మీడియా చెబుతోంది. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో జగన్ ఉండాలి కానీ.. పార్టీని ఆత్మ రక్షణలో పడేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. వివాదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు అయితే ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు కానీ.. ఈ వ్యాఖ్యలను ఎలా సరి చేసుకోవాలో తెలియక సతమతం అవుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper