Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Sakshi: జగన్ ను పక్కన పెట్టేసిన సాక్షి!

YS Jagan Sakshi: జగన్ ను పక్కన పెట్టేసిన సాక్షి!

YS Jagan Sakshi: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే అజెండాతో ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఏపీ ప్రజలతోపాటు మీడియా, అన్ని వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ సంచలన నిర్ణయం తీసుకుంటే […]

YS Jagan Sakshi: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే అజెండాతో ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఏపీ ప్రజలతోపాటు మీడియా, అన్ని వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ సంచలన నిర్ణయం తీసుకుంటే సొంత మీడియా సంస్థ సాక్షితో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జగన్ పిలుపునిచ్చిన మావిగన్ వర్సెస్ అమరావతి అనే ప్రధాన నినాదాన్ని పక్కన పెట్టి.. ఆయన ప్రెస్మీట్లో వాడిన హే రామ్.. సేవ్ ఆంధ్ర అనే అంశాన్ని బ్యానర్ స్టోరీ గా మార్చేశారు.

* మావిగన్ పై ప్రాధాన్యత తగ్గించి..
జగన్ ఇలా ప్రకటన చేస్తే సాక్షి ఈశ్వర్ అలా రెచ్చిపోతారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ వ్యాఖ్యలను సాక్షిలో పెద్దగా హైలెట్ కాలేదు. పార్టీ అధినేత లైన్ తీసుకుంటే.. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన సొంత మీడియానే ఎందుకు ఇంత సైలెంట్ అయింది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆ వ్యూహదారులు ఎవరు అంటే సజ్జల పేరు వినిపిస్తోంది. అయితే మావిగన్ అనే మాత పార్టీ శ్రేణులకు నచ్చలేదన్న టాక్ కూడా ఉంది. మరోవైపు జగన్ మాట్లాడే కంటెంట్ విషయంలో మొత్తం వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మూడు రాజధానుల సెంటిమెంట్ పనిచేయలేదు. ఇప్పుడు అనవసరంగా అమరావతిని టార్గెట్ చేస్తే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో పార్టీకి డ్యామేజ్ తప్పదని సజ్జల వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జగన్ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సజ్జల దానిని ఫిల్టర్ చేసే పనిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

* వైసీపీ శ్రేణుల్లో గందరగోళం..
జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో పాటు ప్రకటనలు సాక్షి మీడియాలో పతాక స్థాయిలో రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అధినేత కీలకమైన పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు సొంత మీడియా దానికి బ్రాండింగ్ ఇవ్వాలి. కానీ జగన్ ప్రకటనలకు సాక్షి మీడియాలో కత్తెర వేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మావిగన్ అంటూ చేస్తున్న కొత్త ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక స్థిరమైన క్యాపిటల్ పాలసీ లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని అంతర్గత సమావేశాల్లో అసహనంతో ఉన్నారు. అందుకే ఎందుకైనా మంచిదని సాక్షి వార్త ప్రాధాన్యతను తగ్గించిందన్నది వినిపిస్తున్న మాట. జగన్ తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే స్లోగన్లు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని సొంత క్యాడరే గ్రహించింది. అందుకే సాక్షి సైతం జగన్మోహన్ రెడ్డి ప్రకటనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా వ్యూహం అని స్పష్టమవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper