Homeఆంధ్రప్రదేశ్‌Gudivada Amarnath: మహిళ అని చూడకుండా.. గుడివాడ అమర్నాథ్ అదేం పని!

Gudivada Amarnath: మహిళ అని చూడకుండా.. గుడివాడ అమర్నాథ్ అదేం పని!

Gudivada Amarnath: ఏపీ రాజకీయాల్లో ఒక వింత వైఖరి కనిపిస్తోంది. మహిళా నేతల పట్ల వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని, రాజకీయ ఎదుగుదలను కించపరిచేలా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విమర్శలు చేయడం సహజమే. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేయడం మాత్రం ముమ్మాటికీ రాజకీయ దిగజారుడు తనమే. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న గుడివాడ అమర్నాథ్.. ఏకంగా ఈ రాష్ట్ర హోం మంత్రిని, ఒక మహిళా నేతను కించపరచడం మాత్రం సహేతుకం కాదు.

* స్వయంకృషితో ఎదిగి..
ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా ఉన్న వంగలపూడి అనిత, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణించారు. కేవలం తన వాగ్దాటి, నిరంతర పోరాట పటిమతో రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగారు. ఆమె కెరీర్ ను గమనిస్తే స్వయంకృషి కనిపిస్తుంది. అయితే ఆమె ఎదుగుదల జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు సైతం కనుమరుగవుతున్న తరుణంలో.. అటువంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన గుడివాడ అమర్నాథ్.. ఒక మహిళా నేతకు వచ్చిన ఆదరణను తట్టుకోలేక ఎటువంటి విమర్శలు చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళిత మహిళగా ఆ సామాజిక వర్గం వారు కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

* హద్దులు దాటుతున్న విమర్శలు..
మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలను నియంత్రించాలంటే గుడివాడ అమర్నాథ్ ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. విమర్శలు సరిహద్దులు దాటి వ్యక్తిగత దాడులు చేయడం, మానసికంగా వేధించడం, చివరకు భౌతిక దాడులకు దిగడానికి కూడా రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది అత్యంత ప్రమాదకరం కూడా. రాజకీయాల్లో నైతిక విలువలను పక్కనపెట్టి, కేవలం కక్ష సాధింపు చర్యల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం దారుణం. గుడివాడ అమర్నాథ్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలు మరొకరు చేయకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే ఒక హోంమంత్రి, ఒక మహిళా మంత్రిని ఆ స్థాయిలో కించపరచడం అంటే కండకావరమే. అందుకే గుడివాడ అమర్నాథ్ ను గుడిసెట్టి అమర్నాథ్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
Oktelugu Epaper