spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Notices to Resigned YCP MLCs: ఆ ఐదుగురు రాజీనామా.. ఏది జరిగినా సంచలనమే!

Notices to Resigned YCP MLCs: ఆ ఐదుగురు రాజీనామా.. ఏది జరిగినా సంచలనమే!

Notices to Resigned YCP MLCs: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల విషయంలో ఏ నిర్ణయము ప్రకటించలేదు మండలి చైర్మన్. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఆరుగురు వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే తాము మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నామని మండలి చైర్మన్ ఫార్మేట్ లోనే వారు తమ లేఖలను ఇచ్చారు. కానీ మండలి చైర్మన్ మోసేన్ రాజు మాత్రం వాటిని ఆమోదించలేదు. అయితే ఇప్పుడు దీనిపై రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు న్యాయ పోరాటం చేయడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మండల చైర్మన్ కు ఏర్పడింది. కోర్టు ఆదేశాల మేరకు రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయ మంగళం వెంకటరమణ నుంచి వివరణ తీసుకోనున్నారు చైర్మన్. మిగతా ఎమ్మెల్సీల విషయం ఈనెల 26న విచారణ చేపట్టనున్నారు. అయితే ఈసారి కోర్టు ఆదేశాలు సీరియస్ గా ఉంటాయని భావించి.. వారి రాజీనామాలపై మండలి చైర్మన్ ఒక నిర్ణయానికి వస్తారని ప్రచారం నడుస్తోంది.

పార్టీతో పాటు పదవులకు గుడ్ బై..
2024 ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ, మరి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇందులో పోతుల సునీత బిజెపిలో చేరారు. జయ మంగళం వెంకటరమణ మాత్రం జనసేన గూటికి చేరారు. మిగతా ముగ్గురు టిడిపిలో చేరిపోయారు. అయితే పార్టీకి వీరు రాజీనామా చేసి ఏడాది దాటుతోంది. కానీ శాసనమండలి చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదించలేదు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే ఈ ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమి ఖాతాలో చేరిపోతాయి. మండలిలో కూటమి బలం పెరుగుతుంది. ఆ కారణం చేతనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండలి చైర్మన్ రాజీనామాలను ఆమోదించలేదు.

హైకోర్టును ఆశ్రయించడంతో..
ఇందులో జయ మంగళం వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించడం లేదని ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. తక్షణం పరిశీలన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ కు కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో రేపు వ్యక్తిగతంగా హాజరుకావాలని జయ మంగళం వెంకటరమణ ను మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత రోజు మిగతా ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అయితే వీరి రాజీనామాల ఆమోదం విషయంలో కోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే వారు శాసనమండలి చైర్మన్ ఫార్మాట్లో, మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. అయితే రాజకీయ కోణంలోనే మండలి చైర్మన్ ఆలోచించి ఆమోదించడం లేదని.. ఈ ఎమ్మెల్సీలు అంతా తమ వాదనలు వినిపిస్తే మాత్రం ఇబ్బంది కరం. అందుకే మండలి చైర్మన్ వీరిని పిలిపించి ఏదో ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. రాజీనామాలను ఆమోదించినా.. ఆమోదించకపోయినా అది సంచలన అంశంగానే మిగలనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper