2.5 lakh houses distribution: రాష్ట్ర ప్రభుత్వం( state government) మరో భారీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టనుంది. ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన గూడు అనే లక్ష్యంతో ప్రభుత్వం మరో చారిత్రక ఘట్టాన్ని మొదలుపెట్టనుంది. రెండో విడత సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఈరోజు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇలా పంపిణీ అనేది రెండోసారి నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో రాయచోటి నుంచి మూడు లక్షల ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించింది. అయితే ఇవి పూర్తయిన తర్వాత కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది.
హాజరుకానున్న సీఎం చంద్రబాబు..
ఈరోజు సూళ్లూరుపేట, ( sullurpeta ) నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదురు గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటు ఒకటి పాయింట్ 50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఇదే సందర్భంలో పేదరిక నిర్మూలనకు గాను చేపట్టిన పి4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఈరోజు రోజంతా బిజీబిజీగా గడపనున్నారు ఏపీ సీఎం. రాత్రి వరకు ఆయనకు బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ భారీ గృహప్రవేశాల కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిందలు ఉన్నాయి. పారదర్శకమైన పాలనతో పేదలకు గూడు కల్పించడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకోనుంది.
Also Read: చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలో విజయ్.. 2 స్థానాల్లో పోటీ.. విజయావకాశాలు ఎంత మాత్రం ఉన్నాయంటే..
కొత్త ఇల్లు మంజూరు సైతం..
ఈ సామూహిక గృహప్రవేశాల అనంతరం కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియ ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా ఇల్లు క్యాటయించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద మంజూరు చేస్తే పేదల ఇళ్లకు సంబంధించిన యూనిట్ ధరను పెంచింది ప్రభుత్వం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.20 లక్షలు ఇస్తాయి. కేంద్ర వాటా రాయితీ కింద రూ.72,000, రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ కింద రూ.48,000, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.27,000, మరుగుదొడ్డి నిర్మాణానికి మరో రూ.12,000 అందించుతున్నారు. డ్వాక్రా రుణం కింద మరో 80,000 కూడా పావలా వడ్డీతో బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తారు. ప్రభుత్వమే ఈ వడ్డీ భరించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తానికైతే ఏపీలో ఇళ్ల పండగ ప్రారంభం అయినట్టే..