Vijay TVK Party Candidates: తమిళనాడు లో వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఎంతో గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతీ రాజకీయ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతే కాకుండా ఈ ఎన్నికల పై అన్ని రాష్ట్రాలకు చెందిన యూత్ ఓటర్లు ప్రత్యేక ద్రుష్టి సారించారు. ఎందుకంటే తమిళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి రావడం , అంతే కాకుండా ఆ పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయడమే. పొత్తులో కలిసి వెళ్తారని అంతా అనుకున్నారు. చివరికి ఒంటరిగానే వెళ్తున్నాడు విజయ్. నేడు తన పార్టీ నుండి పోటీ చేయబోతున్న 211 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ని విడుదల చేసాడు. అందులో తానూ కూడా ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నాడో చెప్పుకొచ్చాడు. ఆయన ఈ ఎన్నికలకు రెండు స్థానాల నుండి పోటీ చేయబోతున్నాడు.
అందులో ఒక స్థానం పెరంబూర్ కాగా, మరో స్థానం ట్రిచీ ఈస్ట్. ఈ రెండు స్థానాలు కూడా అధికార DMK పార్టీ కి కంచు కోటలు లాంటివి. ఉదాహరణకు మన ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కి కుప్పం, వైసీపీ కి పులివెందుల ఎలాగో, DMK పార్టీ కి ఆ రెండు స్థానాలు అలా అన్నమాట. అలాంటి స్థానాల్లో విజయ్ పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి. రెండు ప్రాంతాల్లోనూ విజయ్ మతానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే ఆయన ఆ స్థానాలను ఎంచుకున్నాడని టాక్. అయితే విజయ్ ఈ రెండు స్థానాల్లో గెలవడం దాదాపుగా అసాధ్యం ని అంటున్నారు. రెండు స్థానాల్లో DMK అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను చీల్చి, వాళ్లకు వచ్చే మెజారిటీలను తగ్గించగలడు కానీ, గెలిచేంత సీన్ లేదని అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది. ఎన్నికల ఫలితాలు మే మొదటి వారం లో రానున్నాయి.
అయితే ఈ రెండు స్థానాల్లో పోటీ అనే అంశం సినీ తారలకు పెద్దగా కలిసి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాగే రెండు స్థానాల్లో పోటీ చెస్ , కేవలం ఒక్క స్థానం నుండే గెలిచాడు. కానీ ఆయన పార్టీ మాత్రం ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే. ఈయన కూడా భీమవరం, గాజువాక నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేసాడు. ఆయన పార్టీ ఓడిపోవడమే కాకుండా, స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ కి కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశాలు ఉన్నాయని, చాలా కఠినమైన స్థానాలను ఆయన ఎంచుకున్నాడని అంటున్నారు.
Perambur – C. Joseph Vijay ✋
Trichy East – C. Joseph Vijay ✋– #ThalapathyVijay is contesting in Two constituencies pic.twitter.com/nvwb5e4MlG
— Laxmi Kanth (@iammoviebuff007) March 29, 2026