Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Central Politics: కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. అదిగో సాక్ష్యం!

Chandrababu Naidu Central Politics: కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. అదిగో సాక్ష్యం!

Chandrababu Naidu Central Politics: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా? కేంద్రమంత్రి పదవి చేపడతారా? ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరిస్తారా? పొలిటికల్ సర్కిల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సర్కిల్లో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు ప్రమోట్ అవుతుండడంతో సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్లో ప్రవేశించనున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు బీహార్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కానున్నారు. అయితే బీహార్లో జెడియూ కంటే బిజెపికి సంఖ్యా బలం ఎక్కువ.. పైగా జెడియు బలోపేతానికి, తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం నితీష్ కుమార్ ఈ నిర్ణయానికి వచ్చారు.

Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!

* కీలక భాగస్వామి..
ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కీలక భాగస్వామి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు సైతం ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే బీహార్లో జెడియు బలం తగ్గుతోంది. కేవలం నితీష్ కుమార్ చరిష్మా పైనే ఆ పార్టీ ఆధారపడి ఉంది. ఆ పార్టీ బీహార్ రాజకీయాల్లో నిలబడాలంటే, బలపడాలి అంటే, నితీష్ కుమార్ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఈ నిర్ణయం అనివార్యంగా తెలుస్తోంది. నితీష్ కుమార్ కేంద్ర క్యాబినెట్ లో రైల్వే శాఖ మంత్రి పదవిలో ఉండి.. కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం గా ఉంటే జెడియు పుంజుకుంటుందన్న సర్వేలు తేల్చుతున్నాయి. అందుకే నితీష్ కుమార్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

* ఆ సాహసం చేస్తారా
అయితే ఇప్పుడు ఎన్డీఏలో( National democratic Alliance ) కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్లో చేరడమే కాకుండా ఎన్ డి ఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది. ఢిల్లీ సర్కిల్లో సైతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఎన్డీఏ కన్వీనర్ వరకు ఒకే కానీ ఏపీ రాజకీయాల నుంచి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఆపై అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014 నుంచి 2019 తో పోల్చుకుంటే ప్రస్తుతం కేంద్రం సహకారం పుష్కలంగా ఉంది. ఈ సమయంలో మాత్రం చంద్రబాబు ఆ సాహసం చేయరు.

* జెడియు కంటే భిన్నం..
నితీష్ కుమార్( Nitish Kumar) విషయంలో వేరు. ఎందుకంటే బీహార్లో జెడియు బలం పరిమితం. ఆ పార్టీతో పోల్చుకుంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం అధికం. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది.. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు వారసుడుగా లోకేష్ సైతం ఉన్నారు. చంద్రబాబును ఏపీ రాజకీయాల నుంచి కదిలిస్తే ఆ బాధ్యతలు తీసుకున్న విషయంలో రాజకీయంగా వైరుధ్యాలు వస్తాయి. అది ఎంత మాత్రం బిజెపికి అక్కరకు వచ్చే అంశం కాదు. అందుకే నితీష్ మాదిరిగా చంద్రబాబు విషయంలో బిజెపి పెద్దలు ఆలోచన చేయరు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అనేది ఒక ప్రచారం మాత్రమేనని.. అది సత్య దూరం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular