Botsa Satyanarayana Health Update: రాజకీయ ప్రముఖుల ఆరోగ్య విషయంలో అనేక రకాల వార్తలు వస్తుంటాయి. వాటిపై రకరకాల చర్చ నడుస్తుంది. అయితే నిన్ననే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు బొత్స సత్యనారాయణ. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని.. హుటాహుటిన హైదరాబాద్ తరలించారని మీడియాలో ప్రచారం నడిచింది. పార్టీ శ్రేణులు సైతం ఆందోళనకు గురయ్యాయి. అయితే సాయంత్రానికి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని.. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చినట్లు ప్రకటన వచ్చింది. అయినా సరే ఇలా అస్పష్టమైన ప్రచారంతో అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన మాత్రం నెలకొంది. కానీ బొత్స స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎకౌంట్లో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పోస్ట్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
* అసెంబ్లీ జరుగుతుండగా..
గత కొద్దిరోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. శాసనమండలిలో మాత్రం వైసిపి పక్ష నేతగా ఉన్న బొత్స ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. గురువారం సైతం ఆయన మండలికి హాజరయ్యారు. అయితే గురువారం రాత్రి బచ్చకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని.. హుటాహుటిన హైదరాబాద్ తరలించినట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ లో బొత్స సత్యనారాయణ కు చేర్చినట్లు వార్తల్లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు అసలు విషయాలు వెల్లడించారు.
* ట్వీట్ సారాంశం ఇదే
” నా ఆరోగ్యం పై ఆందోళన చెందవద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రొటీన్ చెకప్ లో భాగంగా మాత్రమే ఆసుపత్రికి వచ్చాను”.. అంటూ బచ్చ సత్యనారాయణ పేరు మీద వైసిపి ట్వీట్ చేసింది. మరోవైపు బొత్స సత్యనారాయణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆయన కుమార్తె అనూష వెల్లడించారు. బీపీ ఎక్కువగా ఉండడంతో వైద్యులు పరీక్ష చేస్తున్నారని వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆ ఇద్దరూ ఆకాంక్షించారు. అయితే బొత్స అనారోగ్యం పై ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి. గత ఏడాది చీపురుపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఎండకు అప్పట్లో ఆయన అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ధ్రువీకరించారు. అయితే నిన్న రోజంతా బ్రెయిన్ స్ట్రోక్ అని ప్రచారం జరగగా.. సాధారణ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వెళ్లినట్లు బొత్స స్వయంగా ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా ఉన్న బొత్స ఆరోగ్య ప్రకటనల విషయంలో ఒక రకమైన గందరగోళం ఏర్పడుతోంది. ఏది వాస్తవం తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
నా ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు..నేను ఆరోగ్యంగానే ఉన్నాను..
రొటీన్ చెకప్‌లో భాగంగా మాత్రమే ఆస్పత్రికి వచ్చాను -బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత— YSR Congress Party (@YSRCParty) February 27, 2026