IPhone 16 Croma: iphone ఫోన్ కొనాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. కానీ లగ్జరీ ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. అయినా కూడా ఇండియాలో యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్ వచ్చిందంటే క్యూలో నిల్చొని మరి కొనుగోలు చేస్తారు. అయితే కొందరు ఈ ఫోన్ ను తక్కువ ధరకు దక్కించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఒక్కోసారి ఆఫర్స్ ప్రకటించి తక్కువ ధరకే అందిస్తుంటారు తాజాగా Croma Everything Sale లో యాపిల్ కంపెనీకి చెందిన రెండు మొబైల్స్ తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో ఐఫోన్ 16, 17 సిరీస్ ఉన్నాయి. వీటితోపాటు మ్యాక్ బుక్ కూడా ఉంది. మరి వీటిపై ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
Tata కంపెనీకి చెందిన Croma Everything verything Sale లో యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో iphone 16 విషయానికి వస్తే.. దీని ధర రూ.71,999 గా ఉంది. అయితే ఈ ఫోన్ పై రూ.16,000 వరకు ఎక్స్చేంజి ఆఫర్, రూ.6,000 అదనపు బోనస్, రూ.15,000 వరకు డిస్కౌంట్ కూపన్, రూ.3,999 వరకు టాటా న్యూ కాయిన్స్ ఆఫర్ లభించనున్నాయి. ఈ ఆఫర్స్ ఫోను ఈ ఫోన్ రూ.35,991 కే పొందే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 17 ధర ప్రస్తుతం..రూ.82,900 తో విక్రయిస్తున్నారు. దీనిపై కూడా ఐఫోన్ 16 ఆఫర్ ప్రకటించడంతో.. ఈ ఫోన్ ధర కూడా తగ్గే అవకాశం ఉంది.అలాగే MacBok పై కూడా ఆఫర్ ఉండడంతో దీనిని రూ.59,320 కి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ అనగానే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఐఫోన్ 16 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా OLED డిస్ప్లే ఉండనుంది. అలాగే ఇది 3nm ప్రాసెస్ పై పని చేస్తుంది. 8gb రామ్ నుంచి 12 జిబి రామ్ వరకు కుంటూ.. 128 జీబీ స్టోరేజ్ వరకు స్పేస్ ఇస్తుంది. ఇందులో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 48 MP మెయిన్ కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ లైన్స్ తో ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే 12 ఎంపీ సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. నేటి కాలంలో ఎక్కువగా ఏఐ ఫీచర్స్ యూస్ చేయడంతో ఇలాంటి ఫీచర్లు కూడా ఈ ఐఫోన్ లో కనిపిస్తాయి. ఐఫోన్ 17 వెర్షన్ లోనూ 48 ఎంపీ కెమెరా పనిచేస్తుంది.
ఇక MacBook Air M4 లో 13.6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది యాపిల్ కంపెనీకి చెందిన M4 చిప్ పై పని చేస్తుంది. ఇందులో 16 జిబి రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ ఉండనుంది. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ తోపాటు మెరుగైన బ్యాటరీని ఇందులో చేర్చారు.