Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: పోస్టల్ బాక్స్ లు ఎత్తుకెళ్లొచ్చు.. జగన్ దృష్టిలో అది తప్పు...

YS Jagan Mohan Reddy: పోస్టల్ బాక్స్ లు ఎత్తుకెళ్లొచ్చు.. జగన్ దృష్టిలో అది తప్పు కాదు..

YS Jagan Mohan Reddy: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సైతం ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి అత్యంత ముఖ్యమైనవి. వీటిని పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటుంది. ఎవరైనా నోరు జారీ మాట్లాడినా.. ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినా.. ఇంకా అనేక వ్యవహారాలలో ఎన్నికల సంఘం అత్యంత కఠినంగా ఉంటుంది. నిబంధనలు పారదర్శకంగా అమలు చేస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు […]

YS Jagan Mohan Reddy: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సైతం ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి అత్యంత ముఖ్యమైనవి. వీటిని పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటుంది. ఎవరైనా నోరు జారీ మాట్లాడినా.. ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినా.. ఇంకా అనేక వ్యవహారాలలో ఎన్నికల సంఘం అత్యంత కఠినంగా ఉంటుంది. నిబంధనలు పారదర్శకంగా అమలు చేస్తుంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమించవచ్చు. పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించవచ్చు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిబంధనలు పట్టించుకోకుండా.. పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పరిధిలోని నల్లపాడు వద్ద స్థానిక సంస్థల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్న వాహనాన్ని ఆయన అడ్డగించారు. పోలింగ్ సిబ్బంది నుంచి బ్యాలెట్ బాక్స్ లను లాక్కోవడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి రోడ్డుమీద బైఠాయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. నేరపూరితమైన చర్యలకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కు తరలించింది.

అప్పిరెడ్డి అరెస్టుపై జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన అరెస్టు ప్రజాస్వామికమని చెప్పారు. ప్రభుత్వం నిర్బంధాలు చేస్తోందని.. ఇది దుర్మార్గం అంటూ చెప్పుకొచ్చారు. నడిరోడ్డు మీద బ్యాలెట్ బాక్స్ లు తరలించడాన్ని ఆయన తప్పు పట్టారు. వాస్తవానికి ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు.. వారిని అడ్డగించడం తప్పనే విషయాన్ని జగన్ పూర్తిగా మర్చిపోయారు. అప్పిరెడ్డి రోడ్డు మీద వీరంగం చేసినప్పటికీ సమర్థించారు. పోలీసులు అరెస్ట్ చేయడం తప్పని పేర్కొన్నారు.

ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ బాక్స్ లకు విఘాతం కలిగిస్తే.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తెలిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పిరెడ్డి ఈ పని చేయకుండా.. కనీస స్పృహని కూడా వదిలేసి రోడ్డు మీద హంగామా చేశారు. బ్యాలెట్ బాక్స్ లను తనిఖీ చేస్తానని ఆయన ఎన్నికల అధికారిలాగా బిల్డప్ ఇవ్వబోయారు. దీనిని టిడిపి నేతలు గుండాయిజం అంటున్నారు పైగా దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థించడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper