Assam Girl Sings Telugu Song: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉంటుంది. పైగా ఆయన క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అధికారుల పనితీరులో లోపం ఉన్నప్పటికీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయరు. అధికారులను పనితీరు మార్చుకోవాలని సూచిస్తారు. అంతేతప్ప అనవసరమైన విషయాలలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయరు. పైగా ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితుల మీద విపరీతమైన కమాండింగ్ ఉంది. అందువల్లే పని చేయించుకునే విధానంలో ఆయన సానుకూల విధానాన్ని మాత్రమే పాటిస్తుంటారు. అందువల్లే నారా లోకేష్ ప్రజల మెచ్చిన మంత్రి అయ్యారు. మంగళగిరి ప్రజల అభిమాన నాయకుడయ్యారు.
సోషల్ మీడియాలో నారా లోకేష్ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను.. తాను మెచ్చిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా.. ఇటువంటి వినూత్నమైన అంశాలను కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటారు. అందువల్లే ఆయన చాలామందికి నచ్చుతారు. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.
ఆ వీడియోలో ఒక బాలిక పాట పాడుతోంది. ఆ బాలిక ముఖ కవళికలను చూస్తే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి అసాబ్ రాష్ట్రానికి చెందిన అదితి. ఈమె పుట్టింది అస్సాం రాష్ట్రంలో అయినప్పటికీ.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. పైగా తెలుగులో గీతగోవిందం అనే సినిమాలో వచ్చిందమ్మా అనే పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట విన్న నారా లోకేష్ ఒక్కసారిగా ఆనంద పరశుడైపోయారు. అంతేకాదు ఆ పాట పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“ఆ అమ్మాయి గొంతు బాగుంది. ఆ పాట వింటుంటే ఆనందంగా ఉంది. భిన్నభాషలకు.. బిందమైన సంస్కృతులకు మన దేశం పుట్టిల్లు. ఇన్ని రకాల భిన్నత్వాలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజల హృదయం ఒకటిగానే ఉంటుంది. సంగీతం.. సంస్కృతి.. దేశ ప్రజలను ఏకం చేస్తాయి. ఇవి రాజకీయాల కంటే కూడా లోతుగా ప్రజల మధ్య బంధాలను ఏర్పరుస్తుంటాయి. ఇటువంటి క్షణాలు మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయని” నారా లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
నారా లోకేష్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత.. ఆదితి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. అసలు ఆమె ఎవరు.. నేపథ్యం ఎక్కడ.. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా పాడగలుగుతుంది.. ఆమె గొంతు చాలా అందంగా ఉంది.. సినీ అవకాశాలు ఇస్తే ఆమె స్థాయి మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
An Assamese child singing “Vachindamma” from Geetha Govindam with such joy is the real spirit of #India.
Different languages. Different cultures. One heartbeat.
Moments like these remind us that #music and culture unite our country far more deeply than politics ever can. pic.twitter.com/swUTQu4owi
— Lokesh Nara (@naralokesh) May 16, 2026
