Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Local Body Elections: వైసిపికి షాక్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు..

Andhra Pradesh Local Body Elections: వైసిపికి షాక్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు..

Andhra Pradesh Local Body Elections:లోకల్ బాడీ ఎలక్షన్లలో వైసిపి కి గవర్నమెంట్ ఎంప్లాయిస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వైసిపి ముందంజ అంటూ.. ఆర్ టి వి స్క్రీన్ షాట్లను వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు ఫేక్ చేసి వదిలారు. నిజానికి మొత్తం అన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్ లో కూటమి స్పష్టమైన లీడ్ […]

Andhra Pradesh Local Body Elections:లోకల్ బాడీ ఎలక్షన్లలో వైసిపి కి గవర్నమెంట్ ఎంప్లాయిస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వైసిపి ముందంజ అంటూ.. ఆర్ టి వి స్క్రీన్ షాట్లను వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు ఫేక్ చేసి వదిలారు. నిజానికి మొత్తం అన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్ లో కూటమి స్పష్టమైన లీడ్ లో దూసుకొచ్చింది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఆర్ టి వి న్యూస్ బయటపెట్టింది. కానీ వైసీపీ తనకు అనుకూలంగా ఉండేందుకు ఆర్టీవి ప్రచారం చేసిన క్లిప్పింగులను తనకు అనుకూలంగా మార్చుకొంది. చివరకు ఎన్నికల ఫలితాలు కూడా ఫేక్ చేసి.. తమ క్యాడర్ మొత్తాన్ని జగన్ మోసం చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

2024 ఎన్నికల్లో వైసిపికి 40 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 25 నుంచి 30% వరకు మాత్రమే వచ్చాయి. దీంతో వైసిపి నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వాస్తవానికి మొత్తం తామే లీడ్ లో ఉన్నామంటూ.. సొంత ఛానల్ లో ఫేక్ కథనాలను ప్రసారం చేయించింది వైసిపి. వాస్తవానికి దీనిని నిజమని వైసిపి కార్యకర్తలు అనుకున్నారు. తాము స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తున్నామని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావడం కాదు.. మరొకసారి దిమ్మతిరిగే విధంగా వచ్చాయి. దీంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి.

ఇక పులివెందుల మున్సిపల్ స్థానంలో వైసిపి కోరుకున్నట్టుగా అక్కడ ఫలితాలు రావడం లేదు. మొదటి రౌండ్లో జగన్ పిన్ని ప్రమీల వెనుకంజలో ఉన్నారు. ఈ కథనం రాసే సమయం వరకు ప్రమీలమ్మ 4641 ఓట్లు సాధించారు. టిడిపి అభ్యర్థి 5040 ఓట్లు సాధించారు. మొత్తంగా ప్రమీలమ్మ 399 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను వేధించారని.. వారికి కనీసం డీఎ లు కూడా చెల్లించలేదని.. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసే ఉద్యోగులపై ప్రభుత్వం నాడు ఉక్కు పాదం మోపిందని.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారని ఏపీలో రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే స్థానిక ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి జై కొట్టడం వెనుక ఇంకా కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు..

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి సంపూర్ణమైన లీడ్ కొనసాగించింది. కానీ ఈ విషయాన్ని తట్టుకోలేక వైసీపీ తన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. వైసిపి అనుకూల చానల్లో ప్రసారం చేసిన వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఉపయోగం ఉండదని భావించి.. ఆర్ టి వి.. ఇంకా కొన్ని చానల్స్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్లు తీసి.. వాటికి సొంత భాష్యం అద్ది.. వైసిపి ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్లో కూటమి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

 

 

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper