Homeఆంధ్రప్రదేశ్‌AP Higher Education Board: చదువుతో పాటు నైపుణ్యం..ఆదాయం.. ఏపీ కీలక నిర్ణయం..

AP Higher Education Board: చదువుతో పాటు నైపుణ్యం..ఆదాయం.. ఏపీ కీలక నిర్ణయం..

AP Higher Education Board: ఉన్నత విద్యను ఉపాధితో అనుసంధానం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను సంపాదించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ. 6,900 చొప్పున ఏడాది పాటు రూ.15,000 అందుకోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎంబెడెడ్ మూడేళ్ల డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులకు ఏడాది పాటు పెయిడ్ ఇంటర్న్ షిప్ అందించనున్నారు.ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలోలో ప్రభుత్వం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కొత్త విధానంలో తొలి రెండేళ్లు సాధారణ అకడమిక్ బోధన కొనసాగుతుంది. సబ్జెక్టు పరిజ్ఞానం, ప్రాథమిక నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తారు. అనంతరం మూడో ఏడాదిలో పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా స్కిల్ కౌన్సిళ్లు సూచించిన పరిశ్రమలు, సంస్థల్లో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు పంపించనున్నారు. అక్కడ వారు ప్రత్యక్షంగా పని చేస్తూ అనుభవాన్ని పొందడమే కాకుండా, పరిశ్రమల పనితీరు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోగలుగుతారు. దీంతో చదువు పూర్తయ్యే నాటికే ఉద్యోగాలకు అవసరమైన అనుభవం కూడా వారికి లభించనుంది.

ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు నెలకు రూ.6,900 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్ అందించనున్నారు. ఇది విద్యార్థులకు ఆర్థికంగా కొంత తోడ్పాటు అందించడంతో పాటు, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రోత్సాహంగా నిలవనుంది. పరిశ్రమల్లో పనిచేస్తూనే ఆదాయం పొందే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేలా కోర్సుల రూపకల్పన చేయనుంది.

ఈ విధానం ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యే నాటికే ఉద్యోగ అవకాశాలకు మరింత దగ్గరవుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవడంతో పాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular