spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP govt holiday on April 23rd: 23న ప్రత్యేక సెలవు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP govt holiday on April 23rd: 23న ప్రత్యేక సెలవు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP govt holiday on April 23rd: ఏపీ ప్రభుత్వం( AP government) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా సెలవులను ప్రకటించింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేరళ, పుదుచ్చేరి, అస్సాం లలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకే ఏపీలో ఓ రెండు జిల్లాలకు సంబంధించి ఓటు హక్కు కలిగిన వారికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు సరిహద్దు జిల్లాలుగా చిత్తూరు, తిరుపతి ఉన్నాయి. తమిళనాడులో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఆ రెండు జిల్లాల్లో ఉన్నారు. వారికి పోలింగ్ నాడు అంటే.. ఈనెల 23న అధికారికంగా సెలవు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం.

ప్రైవేటు ఉద్యోగులకు సైతం..
వారందరూ పేరుకే తెలుగు రాష్ట్రాల వారు కానీ.. చిత్తూరు తో పాటు తిరుపతి జిల్లాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ ఉద్యోగులు అధికం ఆ రెండు జిల్లాల్లో. తమిళనాడు వాసులు ఎక్కువగా వచ్చి ఆ రెండు జిల్లాల్లో స్థిరపడుతుంటారు. మరోవైపు చిన్నచిన్న దుకాణాలతోపాటు ఏపీకి చెందిన ఫ్యాక్టరీలలో సైతం తమిళనాడు కార్మికులు పనిచేస్తుంటారు. అటువంటి వారికి ఈ నెల 23న పోలింగ్ నాడు పెయిడ్ హాలిడే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీవితంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు స్పష్టం చేసింది.

ఆ రెండు జిల్లాలతో ప్రత్యేక అనుబంధం..
తమిళనాడుతో చిత్తూరు తో పాటు తిరుపతి జిల్లాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలు ఎక్కువగా రెండు జిల్లాల్లో నివాసం సాగిస్తుంటారు. అయితే పోలింగ్ నాడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజు వారికి సెలవు ప్రకటించారు. దీనిపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే రోజు అంటే 24 నుంచి వేసవి సెలవులు కూడా ప్రారంభం అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే వారికి ఒకరోజు ముందస్తు సెలవు వచ్చినట్టే. మరోవైపు తిరుపతి తో పాటు చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో తమిళనాడు ఎన్నికల సందడి నెలకొంది. అక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తెలుగువారు ఉండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper