Homeఎంటర్టైన్మెంట్Rakasa movie first week collections: 'రాకాస' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించిన...

Rakasa movie first week collections: ‘రాకాస’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించిన దానికంటే తక్కువే వచ్చింది..

Rakasa movie first week collections: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ కి గడ్డు కాలం ఎదురైంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలుగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో విడుదలైన హే బలవంత్ , విష్ణు విన్యాసాలు , కపుల్ ఫ్రెండ్లీ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఇక మార్చి నెల లో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ […]

Rakasa movie first week collections: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ కి గడ్డు కాలం ఎదురైంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలుగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో విడుదలైన హే బలవంత్ , విష్ణు విన్యాసాలు , కపుల్ ఫ్రెండ్లీ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఇక మార్చి నెల లో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్లు కూడా వచ్చాయి. కనీసం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే చిన్న సినిమాలు అయినా సూపర్ హిట్ అవుతాయని అనుకుంటే , అవి కూడా మిశ్రమ ఫలితాలనే సొంతం చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2 న విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి చాలా కష్టపడుతోంది.

విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియన్స్ లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకుంది ఈ చిత్రం. కానీ విడుదల తర్వాత కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద నెగ్గుకురాగలదని అనుకున్నారు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం 13 కోట్ల రూపాయిలు మాత్రమే కాబట్టి. అయితే వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరం లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.

ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వారం లో 9 కోట్ల 60 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 60 లక్షలు , సీడెడ్ ప్రాంతం నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 2 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాలతో పోలిస్తే, నైజాం ప్రాంతం లోనే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper