Annadata Sukhibhava: ఏపీలో ( Andhra Pradesh)రైతులకు గుడ్ న్యూస్. ఈరోజు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. ఈరోజు కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో చంద్రబాబు ఈ నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రూ.6000 చొప్పున దాదాపు 46.8 లక్షల మంది ఖాతాల్లో రూ.2, 808 కోట్లు జమ కానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14 వేల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.6000 కలిపి.. 20వేల రూపాయలు ఇవ్వడం పూర్తి కానుంది.
Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!
* మూడు విడతల్లో పూర్తి..
తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు సాయం కింద ఏటా కేంద్రంతో కలిసి 20వేల రూపాయల నగదు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మూడు విడతల్లో సాయం అందించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆరువేల రూపాయల మొత్తం మూడు విడతల్లో.. 2000 రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 14 వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో కేంద్రం అందించే 2000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం 5000 చొప్పున అందించింది. ఇప్పుడు చివరి విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు కలిపి 6000 రైతుల ఖాతాల్లో జమ కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 20వేల రూపాయల సాగు సాయం తొలి విడత పూర్తి కానుంది.
* గతంలో రైతు భరోసా పేరిట..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం రైతు భరోసా పేరిట సాగు సాయం అందించేది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మూడు విడతల్లో సాయం చేసేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 రూపాయలు మాత్రమే అందించేది. కేంద్రంతో కలిపి 13,500 సాయం అందించగలిగింది. అంతకుముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి తాము ఒక్కరిమే 15000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేవలం 13,500 సాయానికి పరిమితం అయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే మాత్రం కేంద్రంతో కలిసి 20వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దీనిని అమలు చేయలేకపోయారు. కానీ ఈ ఏడాది ఖరీఫ్ ముందు సాయం చేయడం ప్రారంభించారు. నేటితో మూడు విడతల సాయం పూర్తయింది. మళ్లీ వచ్చే ఖరీఫ్ ముందు కేంద్రం అందించే పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ రెండో విడత ప్రారంభం కానుంది. మొత్తానికి అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి రైతులకు సాయం అందించడంలో చంద్రబాబు సర్కార్ విజయవంతం అయ్యింది.