Homeఆంధ్రప్రదేశ్‌Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తాడా..? మరి...

Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తాడా..? మరి కామెడీ ఎవరు చేస్తారు…

Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా చిరంజీవితో అనిల్ రావిపూడి చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కూడా ఆయన గెస్ట్ రోల్లో నటించి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ చాలా […]

Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా చిరంజీవితో అనిల్ రావిపూడి చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కూడా ఆయన గెస్ట్ రోల్లో నటించి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ చాలా సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాడట. నిజానికి అనిల్ రావిపూడి చేసిన అన్ని సినిమాల్లో వెంకటేష్ చాలా కామెడీ పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టాడు. కానీ మొదటిసారి ఆయన సీరియస్ క్యారెక్టర్ ను చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ సీరియస్ పాత్రలో నటిస్తే ఈ సినిమాలో కామెడీ ఎవరు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

నిజానికి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కామెడీ చేయబోతున్నాడట. అతని కామెడీ టైమింగ్ కూడా అనిల్ రావిపూడి టెస్ట్ చేసి మరి అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసి కామెడీ పంచులను కూడా రాస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికైతే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరమనే చెప్పాలి. ఆయన తక్కువ రోజుల్లో సినిమా చేసి భారీ విజయాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ మనీ జనరేట్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్లు కూడా చాలా సేఫ్ జోన్ లో ఉంటున్నారు…

ఇక ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ సీరియస్ పాత్రలను పోషించాడు. కాబట్టి అతని చేత కామెడీ చేయించి, వెంకటేష్ చేత సీరియస్ పాత్రను వేయించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కాన్సెప్ట్ ను రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరిని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి ని ఎలా చూపిస్తాడు. ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper