spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert: పిడుగులు, ఉరుములు.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rain Alert: పిడుగులు, ఉరుములు.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rain Alert: ఏపీ( Andhra Pradesh) కూల్ గా మారింది. భారీ ఎండల నడుమ చల్లటి వాతావరణం కనిపిస్తోంది. ఎండలు దంచి కొడుతున్న క్రమంలో.. చిరుజల్లులు పడుతున్నాయి. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మిగతా ప్రాంతాల్లో సైతం వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పై ఉపరితల ఆవర్తన ప్రభావం ఏర్పడింది. ఇది మరింతగా విస్తరించనుంది.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* ఈరోజు వర్షాలు పడే జిల్లాలు..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర( North Andhra) నుంచి రాయలసీమ వరకు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఏపీలో తీర ప్రాంతంలో చల్లటి వాతావరణం నెలకొంది. చల్లని గాలులు వీస్తున్నాయి.

* దాదాపు అన్ని ప్రాంతాల్లో..
మరోవైపు తూర్పుగోదావరి( East Godavari ), పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడవచ్చని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అందుకే రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదు అని సూచిస్తుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రారంభం అయితే క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper