Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi Comments Gaddar Awards: మెగాస్టార్ ను వదలరా?.. ఆ ఒక్క మాటను పట్టుకొని!

Chiranjeevi Comments Gaddar Awards: మెగాస్టార్ ను వదలరా?.. ఆ ఒక్క మాటను పట్టుకొని!

Chiranjeevi Comments Gaddar Awards: మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) రామా అన్న కొందరికి బూతుగా వినిపిస్తుంది. పాపం చిరంజీవి యధాలపంగా మాట్లాడిన వ్యాఖ్యలను సైతం కొందరు ట్రోల్ చేస్తుంటారు. తాజాగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై ఇప్పుడు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అదే పనిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ను అందించిన సంగతి తెలిసిందే. అక్కడ సీఎం రేవంత్ […]

Chiranjeevi Comments Gaddar Awards: మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) రామా అన్న కొందరికి బూతుగా వినిపిస్తుంది. పాపం చిరంజీవి యధాలపంగా మాట్లాడిన వ్యాఖ్యలను సైతం కొందరు ట్రోల్ చేస్తుంటారు. తాజాగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై ఇప్పుడు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అదే పనిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ను అందించిన సంగతి తెలిసిందే. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఆనందంలో ఏపీలో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన వాడిన పక్క రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం అనే పదాలను పట్టుకుని కొంతమంది విమర్శలకు దిగుతున్న తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఆయనేమీ విభజించి మాట్లాడలేదు. వినయపూర్వకంగానే మాట్లాడారు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* నంది అవార్డులు అడిగితే..
ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల ప్రదానం జరిగేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట నంది అవార్డులను అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవిస్తున్న తీరును మెగాస్టార్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఏపీ సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను మళ్లీ ప్రారంభించాలని కోరారు. కళాకారులను గౌరవించాలన్న కోణంలోనే చిరంజీవి మాట్లాడారు. ఏపీలో గత కొంతకాలంగా నంది అవార్డులు నిలిచిపోవడం వల్ల సినీ పరిశ్రమలోని ఎంతోమంది ప్రతిభావంతులకు గుర్తింపు లేకుండా పోయింది అన్నది మెగాస్టార్ చిరంజీవి బాధ. దానిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారే తప్ప ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

* ఆ విషయాలను గుర్తించుకోవాల్సిందే..
అయితే చిరంజీవి కామెంట్స్ ను వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించారు కొందరు. అయితే అటువంటి వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం నడుస్తోంది. అటువంటి ప్రభుత్వం పై మెగాస్టార్ చిరంజీవి ఎందుకు విమర్శలు చేస్తారు. ఇప్పటికే జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఒక ప్రత్యేకమైన జ్యురీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి మాటల్లో ఒక్క మాట దొర్లింది. పక్క రాష్ట్రం అనే మాట భౌగోళికంగా తెలంగాణ వేదికపై నుంచి చేసిన ప్రసంగంలో వచ్చిన పదమే. కానీ చిరంజీవి పరాయి రాష్ట్రం అన్నట్టు మాట్లాడారని ఏవేవో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకే భాష మాట్లాడే రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలని.. రెండు చోట్ల కళాకారులకు గౌరవం దక్కాలన్నది చిరంజీవి అభిమతం. ఏపీలో షూటింగులు జరగడం లేదని.. కేవలం టిక్కెట్ల కోసమే వస్తారని చాలామంది సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పై విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండే వ్యక్తి అని గుర్తించుకోవాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper