Homeఆంధ్రప్రదేశ్‌AP Dairy Farmers Loan Scheme: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్!

AP Dairy Farmers Loan Scheme: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్!

AP Dairy Farmers Loan Scheme: ఏపీలో( Andhra Pradesh) పాడి రైతులకు గుడ్ న్యూస్. వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువులు ఎక్కువగా ఉన్నవారు ఎటువంటి పూచికత్తు లేకుండా ఏడు శాతం వడ్డీ పై మూడు లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లింపులు చేస్తే మూడు శాతం వడ్డీ మాఫీ కల్పిస్తారు. ఈ లెక్కన రైతులు నాలుగు శాతం వడ్డీ […]

AP Dairy Farmers Loan Scheme: ఏపీలో( Andhra Pradesh) పాడి రైతులకు గుడ్ న్యూస్. వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువులు ఎక్కువగా ఉన్నవారు ఎటువంటి పూచికత్తు లేకుండా ఏడు శాతం వడ్డీ పై మూడు లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లింపులు చేస్తే మూడు శాతం వడ్డీ మాఫీ కల్పిస్తారు. ఈ లెక్కన రైతులు నాలుగు శాతం వడ్డీ కడితే సరిపోతుంది. రాష్ట్రంలో సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు దీనికి అర్హులు. అయితే కచ్చితంగా పశు కిషన్ క్రెడిట్ కార్డు ఉండాలి. పశువుల సంఖ్యను బట్టి రుణం మంజూరు చేస్తారు బ్యాంకర్లు. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే పశువుల పెంపకానికి గాను చాలామంది బయట వ్యక్తుల వద్ద ప్రైవేట్ రుణాలు చేస్తారు. అటువంటి వారికి పశుకిషన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం మంజూరు చేయడం శుభపరిణామం.

* పాడిరంగం కీలకం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడిరంగం( animal husbandry ) ప్రధానమైనది. వ్యవసాయంతో పాటు పశువులు పెంచి రైతులు ఆర్థికంగా ఉపశమనం పొందుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం పశువుల పెంపకం విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పశు పోషకులకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోంది. ఎప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పశు వసతి గృహాల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలో సొంత భూమి, కౌలు భూమి ఉన్న పాడి రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పశు కిసాన్ క్రెడిట్ ద్వారా ఈ రుణం పొందడానికి అర్హులు. బ్యాంకు నియమ నిబంధనలను అనుసరించి పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచికత్తు లేకుండా గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందవచ్చు.

* ముందుగా క్రెడిట్ కార్డు పొందాలి..
ముందుగా పశువులు పెంచే రైతులు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి పశు కిసాన్ క్రెడిట్ కార్డు( Pashu Kisan credit card) నమూనా దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. ఆధార్ కార్డ్, భూమి పత్రాలు, పశువుల వివరాలు, పాస్పోర్ట్ ఫోటో, పశు వైద్యాధికారి సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు పశువుల దాన కొనుగోలు, మెరుగైన పశువుల యాజమాన్యం వంటివి అందించడానికి ఎక్కువగా వీలు ఉంటుంది. ఎటువంటి పూచికత్తు లేకుండా కేవలం ఏడు శాతం వడ్డీతో రుణం తీసుకోవచ్చు. ఏడాది లోపల ఈ రుణ చెల్లింపులు పూర్తయితే మూడు శాతం వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది. అయితే కేవలం పశుకిషన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ రుణం వర్తిస్తుంది. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాలో ఐదు చొప్పున నియోజకవర్గ కేంద్రాలకు సమీపంలో పశు వసతి గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఒక్కో పశు వసతి గృహంలో 20 నుంచి 25 పెద్ద పశువులకు నివాస సౌకర్యం కల్పించనున్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి ఈ వసతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper